»   » అలా మాట్లాడొద్దు‌:గాలి ఇంట డాన్స్ విషయమై మండిపడ్డ రకుల్

అలా మాట్లాడొద్దు‌:గాలి ఇంట డాన్స్ విషయమై మండిపడ్డ రకుల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహం బెంగుళూరులో క్రితం బుధవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆడిపాడింది. ఈ విషయమై రకరకలా వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అవన్నీ రకుల్ కు చాలా కోపం తెప్పించాయి. దాంతో ఆమె ఈ విషయమై మీడియాతో మాట్లాడింది.

చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

అదెలా జరిగిందంటే...గాలి జనార్దన్‌రెడ్డి ఇంట వైభవంగా నిర్వహించిన కుమార్తె వివాహంపై ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించిది. ఈ వివాహ వేడుకలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ డ్యాన్స్‌ చేసిన నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు రకుల్‌ప్రీత్‌ ఇంటిపై కూడా దాడి చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని రకుల్‌ తాజా ఇంటర్వ్యూలో చెబుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

రకుల్ మాట్లాడుతూ...'జనాలు ఈ విషయాన్ని ఎందుకు వదిలేయరో నాకు తెలియడం లేదు. తొలుత నేను డ్యాన్స్‌ చేయడానికి ఒకటికి మూడింతలు పారితోషికం తీసుకున్నానన్నారు. తర్వాత ఐటీ దాడి జరిగిందని ప్రచారం చేశారు. ఇలా చేయడం చాలా కోపాన్ని తెప్పిస్తోంది.

Rakul Preet Singh Reacts On Gali Wedding Rumours

ఈ రూమర్స్ తో మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఎవరూ నిజానిజాలను పరిశీలించడం లేదు, కనీసం నన్ను అడగడం లేదు. నేను మీడియాతో చాలా ఓపెన్‌గా ఉంటాను. నాజీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటాను' అని రకుల్‌ అన్నారు.

ఇక రకుల్‌ వేదికపై డ్యాన్స్‌ చేస్తుండగా తీసిన వీడియోలను అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె పెళ్లిలో రకుల్‌ప్రీత్‌ అద్భుతంగా డ్యాన్స్‌ చేసిందని ట్వీట్‌ చేశారు.

ఇలా పెళ్లిలో డ్యాన్స్‌ చేయడానికి ఆమె భారీ మొత్తంలో కోటి రూపాయలు వరకూ తీసుకున్నారని చెప్పుకుంటున్నారు‌. ఇంతేకాదు ఇదే పెళ్లిలో ప్రియమణి, తమన్నా కూడా మస్తుగా డాన్స్ లు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ వీడియోలు ఇంకా బయిటకు రాలేదు.

ఈ వివాహానికి .. నిర్మాత విశాల్, బ్రహ్మానందం, సాయికుమార్, ఆయన కుమారుడు ఆది, బహుబాష నటీ రాధిక, మీనా, శ్రీయ, నిరోష, కన్నడ క్రేజీస్టార్ రవిచంద్రన్, ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ తదితరులు గాలి ఇంటి జరిగిన పెళ్లికి హాజరై నవదంపతులను ఆశిర్వధించారు.

English summary
Ever since Rakul danced at Gali Janardhan Reddy's daughter wedding, abuzz with various talks that heroine Rakul Preet's house is raided by Income Tax sleuths. Responding on the same, Rakul gave a stunning reply.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu