»   » అఫీషియల్ : మహేష్' బ్రహ్మోత్సవం'లో హీరోయిన్ ఖరారు

అఫీషియల్ : మహేష్' బ్రహ్మోత్సవం'లో హీరోయిన్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వరుస అవకాశాలు, విజయాలతో జోరు మీదున్న రకుల్‌ప్రీత్‌ సింగ్ మరో సినిమా కమిటైంది. అది మరేదో కాదు... మహేష్ బాబు తదుపరి చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ ఖరారు చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రకుల్ మేనేజర్ మాట్లాడుతూ... "రకుల్ ప్రీతి సింగ్ ..మహేష్ ...శ్రీకాంత్ అడ్డాల చిత్రం బ్రహ్మోత్సవం సైన్ చేసింది. ఆమె ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలు రాబోయో మూడు నెలల్లో చేయబోతోంది. తలో 15 రోజులు డేట్స్ కేటాయించింది. తర్వాత ఆమె మహేష్ ప్రాజెక్టులోకి షిప్ట్ అవుతుంది " అన్నారు.

Rakul Preet Singh signs Mahesh's next!

రకుల్ మాట్లాడుతూ...''నిర్ణయాలు ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు. పరిస్థితులకు తగ్గట్టు మారుతూ ఉండాలి. సినిమా రంగంలో అది అవసరం కూడా'' అంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ''చేసే ప్రతి సినిమా నన్ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉండాలనుకొంటా. అంతకుమించి ప్రత్యేకమైన అజెండాలేవీ నేను రాసుకోలేదు'' అంటోంది.

త్వరలోనే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లాంటి స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడబోతోంది. నటనపరంగా మీకు ప్రత్యేకంగా ప్రణాళికలేమైనా ఉన్నాయా? అని అడిగితే ''దేని గురించీ ఎక్కువగా ఆలోచించడం నాకు అలవాటు లేదు. మనసుకు నచ్చింది చేసుకొంటూ వెళుతుంటా. ఇక్కడ ఇలాంటి సినిమాలే చేయాలి, అక్కడ అలాంటివే ఒప్పుకోవాలి అన్న పట్టింపులు లేవు.

తెరపై కనిపించే విషయంలోనూ పరిమితులేమీ విధించుకోలేదు. కథ కోరుకొన్నట్టు నటించడంలో ఎలాంటి తప్పు లేదనేది నా అభిప్రాయం'' అని చెప్పుకొచ్చింది రకుల్‌. త్వరలో 'పండగ చేస్కో', 'కిక్‌2' చిత్రాలతో సందడి చేయబోతోంది రకుల్‌.

English summary
Rakul Preet Singh signed Mahesh Babu-Srikanth Addala's Brahmotsavam. She will be shooting for Ram Charan & NTR films for the next 3 months. Allotted 15 Days per month for each of these films. Later, She will move to Mahesh's project."
Please Wait while comments are loading...