»   »  'బాహుబలి' గురించి రకుల్‌ప్రీత్ సింగ్ ఇలా...

'బాహుబలి' గురించి రకుల్‌ప్రీత్ సింగ్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి'ని చూసి మురిసిపోనివారులేరు. ఈ జాబితాలోకి ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ...రకుల్ ప్రీతి సింగ్ చేరింది. గతకొంతకాలంగా రామ్ చరణ్, శ్రీను వైట్ల చిత్రీకరణ కోసం బిజీగా ఉన్న రకుల్ ఇటీవలే అక్కడి షెడ్యూల్‌ పూర్తి చేసుకొని తిరిగొచ్చింది. వచ్చిన వెంటనే 'బాహుబలి'ని వీక్షించింది రకుల్‌. ఆమె వెంటనే ట్విట్టర్ ద్వారా ఇలా తన అభిప్రాయాన్ని తెలియచేసింది. ఆమె ఏం చెప్పిందే మీరే చూడండి.


లేటనా ఫైనల్ గా..బాహబలి ని చూసాను. ఇలాంటి సినిమా అందించిన ఇండస్ట్రీలో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. రాజమౌళి గారు గ్రేట్.బాహుబలి...తెలుగు సినిమాని అంతర్జాతీయ స్దాయికి తీసుకు వెళ్లింది. రానా, ప్రభాస్, తమన్నా,రమ్యకృష్ణ అద్బుతమైన ఫెరఫార్మెన్స్ లు ఇచ్చారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


 Rakul Preethi tweet about Baahubali

రకుల్ కెరీర్ విషయానికి వస్తే..


ఎన్టీఆర్ తో చిత్రం, రవితేజ 'కిక్-2', బాలీవుడ్ మూవీ 'శిమ్లా మిర్చి' చిత్రాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్... రామ్ చరణ్ సినిమాలో షూటింగ్ లోనూ పాల్గొంటోంది. మిగతా చిత్రాల షూటింగ్ పూర్తి కావస్తున్నప్పటికీ రామ్ చరణ్ సినిమా మాత్రం ఇటీవలే ప్రారంభమైంది. సెప్టెంబర్ నాటికి విడుదల తేదీ ప్రకటించడంతో వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమా ఎక్కువభాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకోనుంది.


రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతూ... కరెంట్ తీగలాంటి షాక్ లతో... కుర్రకారును తన అందాలతో కిర్రెక్కిస్తోంది. లౌక్యంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ... పండగచేస్కో సినిమాలో నటించడం మాటేమోకానీ... స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ.... కెరీర్ విషయంలోనూ నిజంగానే పండగచేస్కోంటోంది.


రవితేజతో నటిస్తున్న కిక్-2 విడుదల కాకముందే.. రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకున్న రకుల్... మరోవైపు మహేశ్ సినిమాతో పాటు ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. సో.. ప్రస్తుతం రకుల్ ఖాతాలో నలుగురు స్టార్ హీరోల సినిమాలున్నాయన్నమాట.


ప్రస్తుతం ఎన్టీఆర్ తాజా చిత్రం సినిమా సుకుమార్ దర్శకత్వంలో జరుగుతోంది. సుకుమార్ తయారు చేసుకున్న కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్‌లను తీసుకున్నారు.


English summary
Rakul Preet Singh tweeted :" Late but finally saw #Baahuabli !! So proud to b a part of an industry that made such a film. Grand at a diff level.Take a bow ssrajamouli.Baahubali has taken Telugu cinema to an international level!Amazing performances by all tamannaahspeaks #prabhas RanaDaggubati #ramya mam"
Please Wait while comments are loading...