»   » నితిన్ కి జోడీగా సందీప్ కిషన్ హీరోయిన్

నితిన్ కి జోడీగా సందీప్ కిషన్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రితం సంవత్సరం హిట్ లలో ఒకటైన వెంకటాద్రి ఎక్సప్రెస్ లో హీరోయిన్ గా చేసిన రాకుల్ ప్రీతి సింగ్ మరో చిత్రం కమిటైంది. నితిన్ సరసన ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. శ్రీనివాసరెడ్డి అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్రం రీసెంట్ గా లాంచ్ అయ్యింది. భాయ్ చిత్రం తర్వాత సూనూసూద్ విలన్ గా చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంతో తనకు మంచి బ్రేక్ వస్తుందని రాకుల్ భావిస్తోంది.

ఇష్క్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నితిన్ వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తన సొంత సంస్ధ లో ఈ చిత్రం నిర్మాణం జరగనుంది. అలాగే తన సొంత నిర్మాణ సంస్ధ పేరు అయిన శ్రేష్ట్ మూవీస్ ని స్వర్ణా మూవిస్ గా మార్చారు. ఈ చిత్రానికి సురేంద్రరెడ్డి శిష్యుడైన శ్రీనివాస్ దర్శకుడు.

ఇక గుండె జారి గల్లంతైంది చిత్రానికి మాటలు రాసిన హర్షవర్ధన్ మరోసారి నితిన్ తో పనిచేయనున్నాడు. ముకుంద్ పాండే స్క్రీన్ ప్లే అందిస్తారు. దిల్ చిత్రంలా ఇది ఓ కమర్షియల్ చిత్రం అని నితిన్ చెప్తున్నారు. మణిశర్మ కుమారుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు.

మరో ప్రక్క నితిన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ఫోటాన్‌ కథాస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పెై తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌' చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రేమ్‌సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం 'తమిళ సెల్వనుం తనియార అంజలుం' పేరుతో ఈ చిత్రం రూపొందబోతోంది. నిర్మాత గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో లవ్‌, యాక్షన్‌, కామెడీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. సింగర్‌ కార్తీక్‌ ఈ చిత్రానికి మంచి సంగీతం అందిస్తున్నాడు.

English summary

 In Nithin's new film being directed by newcomer Srinivas Reddy, Rakul has been chosen as the heroine. The film was recently launched and it is produced by Nithin's sister Nikitha Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu