»   » 'నాన్నకు ప్రేమతో' : డబ్బింగ్‌ చెప్తూ రకుల్ (ఫొటో)

'నాన్నకు ప్రేమతో' : డబ్బింగ్‌ చెప్తూ రకుల్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'నాన్నకు ప్రేమతో' చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు. ఆమె తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడాన్ని ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. డబ్బింగ్‌ చెబుతున్న సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోని ట్వీట్‌ చేశారు.

Who says dubbing is easy!! 󾍔 but me loving it!! #dubbing #NaannakuPrematho #workislife


Posted by Rakul Preet on 3 January 2016

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


రకుల్ కెరీర్ విషయానికి వస్తే..


రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతూ... కరెంట్ తీగలాంటి షాక్ లతో... కుర్రకారును తన అందాలతో కిర్రెక్కిస్తోంది. లౌక్యంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ... పండగచేస్కో సినిమాలో నటించడం మాటేమోకానీ... స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ.... కెరీర్ విషయంలోనూ నిజంగానే పండగచేస్కోంటోంది.


Rakul start dubbing for Naannaku prematho

రవితేజతో నటిస్తున్న కిక్-2 విడుదల కాకముందే.. రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకున్న రకుల్... మరోవైపు మహేశ్ సినిమాతో పాటు ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. రకుల్ ఖాతాలో నలుగురు స్టార్ హీరోల సినిమాలు పడ్డాయన్నమాట.


ప్రస్తుతం ఎన్టీఆర్ తాజా చిత్రం సినిమా సుకుమార్ దర్శకత్వంలో జరుగుతోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్‌లను తీసుకున్నారు. ఎన్టీఆర్ తో చిత్రం, బాలీవుడ్ మూవీ 'శిమ్లా మిర్చి' చిత్రాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్...బిజీగా ఉంది.

English summary
Rakul Preet Singh Started dubbing for Nannaku Prematho movie.
Please Wait while comments are loading...