»   » రామ్ చరణ్ 10 : కాస్ట్ అండ్ క్రూ అఫీషియల్ డీటేల్స్

రామ్ చరణ్ 10 : కాస్ట్ అండ్ క్రూ అఫీషియల్ డీటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, స్టైలిష్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

రీమేక్: రామ్ చరణ్‌పై ఒరిజినల్ హీరో కామెంట్

రాంచరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ పదో చిత్ర ప్రారంభోత్సవం గీతా ఆర్ట్స్ ఆఫీస్ ప్రాంగణంలో ఈరోజు లాంఛనంగా జరిగింది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, రామ్ చరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Ram Charan 10th movie launch

మెగా ఫ్యామిలీ రేర్ ఫొటోలు...

దీంతో భారీ అంచనాల నడుమ నిర్మించబోతున్న ఈ సినిమాను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందించబోతున్నారు. ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22నుంచి జరగనుంది. ఈ చిత్రానికి నిన్న మొన్నేటి వరకు ధృవ అనే టైటిల్ ప్రచారంలో ఉండేది. అయితే ఈ టైటిల్ ఓకే కాలేదని ఈ రోజు తేలి పోయింది.

నటీనటులు రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక నిపుణులు వివరాల్లోకి వెళితే..సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ -రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, కో ప్రొడ్యూసర్ -ఎన్.వి.ప్రసాద్, ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, దర్శకత్వం - సురేందర్ రెడ్డి.

English summary
Mega Powerstar Ram Charan, stylish filmmaker Surender Reddy and mega producer Allu Aravind have joined forces for a new movie, a remake of Tamil blockbuster Thani Oruvan. Ram Charan will be essaying the role of a powerful cop, while Aravind Swamy has retained his role of a criminal scientist in this remake. Ravishing beauty Rakul Preet Singh has been zeroed in to play the love interest of Ram Charan in this action-thriller.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu