»   » చిరంజీవిపై రానా కామెంట్స్, ఉప్పొంగిన రామ్ చరణ్

చిరంజీవిపై రానా కామెంట్స్, ఉప్పొంగిన రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుక ఇటీవల హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల నుండి ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా చిరంజీవి గురించి మాట్లాడిన విషయాలు ఆకట్టుకున్నాయి. తన తండ్రి గురించి రానా గొప్పగా చెప్పడంపై ఆనందం వ్యక్తం చేసాడు.

‘నాన్న 60వ పుట్టినరోజు వేడుకలో ఆయన గురించి ఎంతో బ్యూటిఫుల్ గా మాట్లాడావు. ఆయన ఎంత కష్టపడ్డారో మనం చిన్నతనం నుండి చూస్తూ పెరిగాం. ఆ విషయాన్ని నువ్వు చాలా పొయెటిక్‌గా చెప్పావు. లవ్ యూ రానా' అంటూ రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగులో పేర్కొన్నాడు. దీనికి రానా స్పందిస్తూ... నీ కోసం నీ ఫ్యామిలీ కోసం నేను ఎప్పుడైనా, ఏ సమయంలోనా సిద్దమ్మే అంటూ రానా రిప్లై ఇచ్చారు.

Ram Charan about Rana speech

రామ్ చరణ్- రానా-శర్వానంద్ చిన్నతనం నుండే బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం. స్కూల్ ఏజ్ నుంచి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకునేంత వరకు ఈ ప్రెండ్ షిప్ బాండ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కలసి చదువుకున్నారు కూడా. తెలుగులో మరో మల్టీ స్టారర్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్, రానా కలసి నటించే అవకాశం వుందని అంటున్నారు.

English summary
"Thanks for opening with such beautiful words at dads 60th b'day , you've seen dad and his work from when we were lil kids , and you got it across poetically , Rana love you" Ram Charan posts on FB.
Please Wait while comments are loading...