twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంటెంటులో దమ్ముండాలి, మన రేంజి పెరుగుతోంది: రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Ram Charan Special interview With News Agency

    భారతీయ సినిమాల మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం వల్ల వసూళ్లు పెరగడంతో పాటు, అన్ని రీజియన్లలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా పెరుగుతాయి అని, తద్వారా ఇండియన యాక్టర్స్ టాలెంట్ కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి వెళుతుందని అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఓ న్యూస్ ఏజన్సీ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

     మన మార్కెట్ పెరుగుతోంది

    మన మార్కెట్ పెరుగుతోంది

    సౌతిండియాకు చెందిన ప్రజలు గల్ఫ్ కంట్రీస్, అమెరికా లాంటి విదేశాల్లో సెటిలయ్యారు. ప్రతి సినిమాకు ఓవర్సీస్ కలెక్షన్ ఎంతో కీలకంగా మారింది. ఇపుడు ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. తద్వారా మన సినిమాల మార్కెట్ పెరిగుతూ వెళుతోంది. ఇది మంచి పరిణామం అని రామ్ చరణ్ తెలిపారు.

    మన సినిమా నెక్ట్స్ లెవల్ కు వెళుతోంది

    మన సినిమా నెక్ట్స్ లెవల్ కు వెళుతోంది

    మన సినిమా నెక్ట్స్ లెవల్ కు వెళుతోంది. బాహుబలి సిరీస్ సినిమాలను కేవలం భారతీయులే కాకుండా ఇతర దేశాల ప్రజలు ఆదరించారు. ధనుష్ హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కించుకుని ఇండియన్ టాలెంటును ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. మున్ముందు ప్రపంచ సినీ వేదికపై భారతీయ సినిమా కీర్తి మరింత పెరుగుతుంది అని రామ్ చరణ్ అభిప్రాయ పడ్డారు.

    కంటెంటులో దమ్ముండాలి

    కంటెంటులో దమ్ముండాలి

    తన తాజా చిత్రం రంగస్థలం రూ. 200 కోట్లు వసూలు చేయడంపై రామ్ చరణ్ స్పందిస్తూ... ‘ఒక రీజనల్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం మంచి పరిణామం. మంచి కంటెంటుతో సినిమా వస్తే ప్రజలు థియేటర్‌కు వెళ్లి చూడటానికి ఆసక్తి చూపుతున్నారు అనడానికి ‘రంగస్థలం' ఒక మంచి ఉదాహరణ'' అని రామ్ చరణ్ తెలిపారు.

    అంతా డైరెక్టర్ చేతిలోనే...

    అంతా డైరెక్టర్ చేతిలోనే...

    చాలా ఎక్స్‌పర్మెంటల్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించలేక పోయాయి. ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రయోగాత్మక చిత్రాలు కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ... ఇక్కడ కథ చెడ్డది అంటూ ఏమీ ఉండదు. సినిమాలు ఆడక పోవడానికి కొన్ని సార్లు బ్యాడ్ స్క్రీన్ ప్లే, సినిమా ట్రీట్మెంట్ సరిగా ఉండక పోవడం కారణం అయుండొచ్చు. సినిమా అనేది డైరెక్టర్ ఆలోచన అనేది నేను బలంగా నమ్ముతాను. నటీనటులు, టెక్నీషియన్లు అతడి ఆలోచనను ఫాలో అవుతాం. డైరెక్టర్ పని తీరు బావున్నపుడే తెరపై అది రిఫ్లెక్ట్ అవుతుంది. అతడి ఆలోచన ఎంత ఎక్కువ మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ అవుతుంది అని రామ్ చరణ్ అన్నారు.

    నాన్నను ఫాలో అవ్వను, కాపీ కొట్టను

    నాన్నను ఫాలో అవ్వను, కాపీ కొట్టను

    నాన్న సినిమాలు ఎప్పటి నుండే ప్రేక్షకులు చూస్తున్నారు. నేను ఆయన శైలిని ఫాలో అయితే కాపీ కొట్టినట్లు అవుతుంది. నాకంటూ ఒక ప్రత్యేక శైలి క్రియేట్ చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. నాకు నేనుగా నటుడిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది, అదే సమయంలో నాన్న పేరు నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది అని రామ్ చరణ్ తెలిపారు.

    English summary
    Ram Charan’s own Telugu film Rangasthalam has managed to mint Rs 200 crore and beyond at the box office. “It is great to receive such numbers at the box office for a regional film because it is a sign that people are still interested to take out some time to go to the theatre and watch a film if the content is good. Having said that, I think all of our responsibility is not to get carried away by the achieved success… and rather start afresh. We tend to go by formula or repeat if we get success in one film. That is not how we can grow as storytellers. So I would rather try new things and experiment and attempt to make it work commercially as well,” he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X