For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మీరంతా మా అభిమానులా?... హాట్సాఫ్: రామ్ చరణ్

  By Bojja Kumar
  |

  'సై..రా నరసింహా రెడ్డి' ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ మాట్లాడుతూ... మిమ్మ‌ల్ని చూస్తుంటే నాకు ఓ సందేహం వ‌స్తుంది. మీరంతా మా అభిమానులా? లేక మేము మీ అభిమానుల‌మా?....అని ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు.

  గ‌త నెల‌ల రోజులుగా నాన్న‌గారి పుట్టిన రోజు సంద‌ర్భంగా అమెరికాలోని 51 సెంట‌ర్ల‌ల‌లో 2000 మంది ప్ర‌జ‌లు, ఏపీ, తెలంగాణ, ఇత‌ర దేశాల్లో మొత్తం క‌లిపి 42000 వేల మంది బ్ల‌డ్ డోనేట్ చేశారంటే నిజంగా మీ అంద‌రికీ హ్యాట్సాఫ్ అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

  నాన్నగారికి ఇంతకు మించిన గిఫ్ట్ లేదు

  నాన్నగారికి ఇంతకు మించిన గిఫ్ట్ లేదు

  మీరు మెగా అభిమానులు కాదు, మెగా బ్ల‌డ్ బ్రద‌ర్స్ అని నాన్న‌గారు ఎందుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నాన్న‌గారికి దీనికి మించిన బ‌ర్త్ డే గిప్ట్ మ‌రొక‌టి లేదు. సినిమాలు వ‌స్తుంటాయి...పోతుంటాయి. కానీ ఈ రిలేష‌న్ షిప్ మాత్రం ఎప్ప‌టికీ చెరిగిపోదు. ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు ఎప్ప‌టికీ నిలిచిపోతాయని రామ్ చరణ్ తెలిపారు.

  Unknown Facts About Mega Star Chiranjeevi "Birthday Special"
   రాజ‌మౌళి

  రాజ‌మౌళి

  నా కెరీర్ లో మొట్ట మొద‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన రాజ‌మౌళి గారి చేతుల మీదుగా ఈ సినిమా పోస్ట‌ర్ లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు.... అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.

  ఆంజనేయస్వామి శక్తి వల్లే...

  ఆంజనేయస్వామి శక్తి వల్లే...

  మా కొణిదెల ప్రొడక్షన్ వెనక ఉన్న బలం ఆంజ‌నేయ స్వామి. ఆ స్వామి శ‌క్తి వ‌ల్లే మేము అడిగిన వెంట‌నే అమితాబ్, సుదీప్, విజ‌య్ పేతుప‌తి వంటి స్టార్లు అంతా మా సినిమా లో భాగ‌మ‌య్యారు. వాళ్లంతా అడిగిన వెంట‌నే కాద‌న‌కుండా ఒప్పుకున్నారు, అందరికీ థాంక్స్ అని రామ్ చరణ్ అన్నారు.

  అల్లు అరవింద్ మాట్లాడుతూ

  అల్లు అరవింద్ మాట్లాడుతూ

  అల్లు అర‌వింద్ మాట్లాడుతూ, `చిరంజీవిగారు సినీ ప‌రిశ్ర‌మకు వ‌చ్చి 40 ఏళ్లు పూర్త‌యింది. అందులో నాది ఆయ‌న‌తో 37 ఏళ్ల జ‌ర్నీ. ఆయ‌న క‌ష్టంతో ఓ తారు రొడ్డు వేశారు. అందువ‌ల్లే ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గ‌ర నుంచి రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీ, వ‌రుణ్, తేజ్, శిరీష్ అంతా ఆరోడ్డులోనే న‌డుస్తున్నారు. మెగాఫ్యామిలీ హీరోల‌కు అద్భుత‌మైన ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి. అదంతా మీ అభిమానుల వ‌ల్లే సాధ్య‌మైంది' అని వ్యాఖ్యానించారు. `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని మాకు అత్యంత ఆప్తుడైన సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. చ‌రిత్ర ఎప్పుడు? ఎందుకు ఎవ‌రిని ఎంచుకుంటుందో తెలీదు. ఈసారి సూరి వంత్తైంది. ఆయ‌న ఈ సినిమాను చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా తెర‌కెక్కించాలి' అని ఆకాంక్షించారు.

  English summary
  Producer Ram Charan announced the huge cast and crew of SYE RAA NARASIMHA REDDY at the function. Big B Amitabh Bachchan will be playing a pivotal role and the other star cast includes Kannada superstar Kichcha Sudeep, Makkal Selvan Vijay Sethupathi and Jagapathi babu. Nayantara will be playing the female lead.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X