twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్లకు గంతలతో రామ్‌చరణ్‌ నడక (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బేగపేంట దేవనార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో ఆదివారం ఉదయం కళ్లకు గంతలు కట్టుకుని 1కే నడక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు రామ్‌చరణ్‌తేజ ముఖ్య అతిధిగా హాజరై 1కే నడకను ప్రారంభించారు.

    ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ... అంధత్వం నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ నెల 16న విడుదల కానున్న తన సినిమా 'బ్రూస్‌లీ' ఒక్క రోజు ముందే దేవనార్‌ అంధుల పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

    Had tears & no words to explain my happiness.The sweetest message I ever got. Will be there tomorrow for you sweethearts!!! #Letswakeup #Letsdoit (people's plaza necklace RD. tomorrow 6.30am)

    Posted by Ram Charan on 3 October 2015

    దేవనార్‌ అంధుల పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరుకావటంతో యువత చాలా మంది ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

    స్లైడ్ షోలో ఈవెంట్ ఫొటోలు

    ఉత్సాహంగా

    ఉత్సాహంగా

    రామ్ చరణ్ ఈ ఈవెంట్ లో చాలా ఉత్సాహంగా పాలు పంచుకున్నారు

    ప్రేరణ

    ప్రేరణ

    ఇలాంటి ఈవెంట్స్ లో పాల్గొంటూ రామ్ చరణ్ మిగతా హీరోలకు ప్రేరణగా నిలుస్తున్నారు

    తొలినుంచీ

    తొలినుంచీ

    ఇలాంటి కార్యక్రమాలకు రామ్ చరణ్ తొలి నుంచీ ప్రయారిటీ ఇస్తూనే ఉన్నారు.

    ఎన్ని పనులున్నా

    ఎన్ని పనులున్నా

    రామ్ చరణ్ ఓ ప్రక్కన తన తాజా చిత్రం బ్రూస్ లీ పనులన్నీ ప్రక్కన పెట్టి మరీ హాజరయ్యారు

    నో రెస్ట్

    నో రెస్ట్

    నిజానికి కంటిన్యూగా రోజుల తరబడి,గంటలు తరబడి షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ నో రెస్ట్ అన్నట్లుగా ఉన్నారు.

    ఆదివారం

    ఆదివారం

    సాధారణంగా సినిమావారు ఆదివారం ఏ పనీ పెట్టుకోవటానికి ఇష్టపడరు. తమ కుటుంబంతో ఎంజాయ్ చేస్తూంటారు. అయినా చరణ్ వాటిని ప్రక్కన పెట్టారు

    తండ్రి నుంచే

    తండ్రి నుంచే

    చిరంజీవి సైతం ఇలాంటి ఈవెంట్స్ లో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇప్పుడే అదే వారసత్వం వచ్చిందంటున్నారు.

    భార్య సహకారం

    భార్య సహకారం

    భార్య ఉపాసన సైతం సోషల్ రెస్పాన్సబులిటీ తో కూడిన పోగ్రామ్స్ కు ప్రయారిటీ ఇస్తూండటం ప్లస్ అయ్యింది

    చలించారు

    చలించారు

    అంధ విద్యార్దులను చూసి రామ్ చరణ్ చలించిపోయారు

    ఉత్సాహం..ఉత్సవం

    ఉత్సాహం..ఉత్సవం

    రామ్ చరణ్ రావటంతో ఆ అంధ విద్యార్దులలో మంచి ఉత్సాహం వచ్చి ఉత్సవంగా మారింది

    మొక్కుబడిగా ..

    మొక్కుబడిగా ..

    ఏదో మొక్కుబడిగా కాకుండా రామ్ చరణ్ వారిలో కలిసిపోయారు

    సెల్ఫీలు

    సెల్ఫీలు

    ఆ పిల్లలతో కలిసి ఆయన సెల్ఫీలు దిగి వారిని మరింత ఉత్సాహపరిచారు.

    English summary
    Ram Charan attended Devnar World Sight Day Walk Event as the chief guest. Ram Charan praised Devnar Foundation’s support for the blind. Ram Charan’s movie ‘Bruce Lee’ which is going to release on 16th October on the eve of Dushera. Ram Charan said there will be a special première show at Devnar Foundation on 15th October for the blind.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X