ఎయిర్ పోర్టు రామ్ చరణ్, ప్రయాణం ఎక్కడికి? (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ముంబై ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఆయన తన తర్వాతి సినిమా షూటింగు కోసం యూరఫ్ వెలుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మార్చి 16న ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత డివివి దానయ్య ‘డివివి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారుకాలేదు. ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

Ram Charan at Mumbai airport

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు."నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X