»   » చిట్టిబాబు సవాల్ విసిరాడు.. భయమేసింది.. సమంత లేకపోతే.. రాంచరణ్

చిట్టిబాబు సవాల్ విసిరాడు.. భయమేసింది.. సమంత లేకపోతే.. రాంచరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Charan About Rangasthalam : Chitti Babu was throw Challenge

రంగస్థలం చిత్రం రాంచరణ్‌కు నటుడిగా కొత్త జోష్‌ను తెచ్చింది. పదేళ్ల కెరీర్‌లో మగధీరను మించిన పేరును ఈ చిత్రం తెచ్చిపెట్టింది. అటు నటుడిగానే కాకుండా కలెక్షన్ కింగ్‌గా కొత్త హోదాను తీసుకొచ్చింది. ప్రస్తుతం రంగస్థలం విజయానందంలో రాంచరణ్ మునిగి తేలుతున్నాడు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆనందాన్ని, సినిమా విశేషాలను పంచుకొన్నారు.

చిట్టిబాబు పాత్ర గొప్ప మార్పు

చిట్టిబాబు పాత్ర గొప్ప మార్పు

నా పదేళ్ల నటజీవితంలో రంగస్థలం గొప్ప మార్పు తెచ్చింది. నటుడిగా సవాళ్లతో కూడిన పాత్రలను ధరించడానికి ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను. రంగస్థలంలో చెవిటివాడి పాత్రను పోషించడం నిజంగా ఓ సవాల్‌గా మారింది. చిట్టిబాబు పాత్ర నిజంగా నాకు విభిన్నమైనది. అందుకే ప్రేక్షకులు ఆ పాత్రకు, సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు అని రాంచరణ్ అన్నారు.

గ్రామీణ వాతావరణాన్ని

గ్రామీణ వాతావరణాన్ని

నా నటజీవితంలో నేనెప్పుడూ గ్రామీణ యువకుడి పాత్రను పోషించలేదు. నేను ఎన్నడూ ఓ గ్రామంలో నివసించలేదు. నా సొంత గ్రామానికి నా తండ్రితో కలిసి చాలా తక్కువగా వెళ్లాను. కానీ రంగస్థలం కొత్త గ్రామీణ వాతావరణాన్ని పరిచయం చేసింది అని రాంచరణ్ పేర్కొన్నారు.

నాపై ఎంతో ప్రభావం

నాపై ఎంతో ప్రభావం

రంగస్థలం సినిమా షూటింగ్ కోసం మేము ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతానికి వెళ్లాం. అక్కడ మొబైల్ సర్వీస్ గానీ, విలాసవంతమైన హోటళ్లు లేవు. కానీ అవి లేవని ఎప్పుడూ బాధపడలేదు. రంగస్థలం సినిమా షూటింగ్‌ నటుడిగా నాపై ఎంతో ప్రభావం చూపింది అని చెర్రీ వెల్లడించారు.

చెవిటివాడి పాత్ర కోసం

చెవిటివాడి పాత్ర కోసం

చెవిటి వాడి పాత్రను పోషించడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను. చిట్టిబాబు పాత్రను అర్థం చేసుకోవడానికి, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడానికి దాదాపు ఐదు నెలలు శ్రమించాను. ఇప్పటివరకు నేను ముతక పాత్రలు పోషించలేదు. వాస్తవ రూపం ఉండేలా ఆ పాత్రను పోషించాలనుకొన్నాను అని రాంచరణ్ అన్నాడు.

సమంత అక్కినేని వల్లనే

సమంత అక్కినేని వల్లనే

కథ, కథనాలు బలంగా ఉండటం వల్లనే సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాను. నాపాత్రను సులభంగా పోషించడానికి ఆ అంశాలే ప్రభావం చూపాయి. దాంతో అద్భుతమైన హావభావాలు పలికించిన సమంత అక్కినేని నా సహచర నటిగా ఉండటం మరింత మెరుగైంది. సమంత లేకపోతే నా నుంచి అంత నటన రాకపోయి ఉండేదేమో. ఇప్పటివరకు నేను పనిచేసిన హీరోయిన్లలో సమంత గొప్ప సహచరనటి అని అన్నారు.

కొత్త నటజీవితం మొదలైంది

కొత్త నటజీవితం మొదలైంది

నటుడిగా నాలో అనేక మార్పులు తీసుకొచ్చిన చిట్టిబాబు పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయాందోళనలు తొలిగిపోయాయి. రంగస్థలంతో కొత్త నటజీవితం ఆరంభమైంది అని రాంచరణ్ పేర్కొన్నారు.

English summary
Rangasthalam starring Ram Charan and Samantha Akkineni is this week’s big release in the south. The film directed by Sukumar has earned a positive buzz ahead of its release and the pre-booking in Telugu speaking states is quite encouraging, according to the trade. It is a film set in the 80s and unfolds in a village. The film also stars Adhi Pinisetty, Jagpathi Babu and Prakash Raj in pivotal roles. While, This movie got good response from all over the world. In this occassion, Ram Charan speaks to media about the movie and professional life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X