For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్: నాన్న తర్వాత స్థానం... పవన్‌ బాబాయ్‌దే!

  By Srikanya
  |

  హైదరాబాద్: ''నాన్న ఈ వేడుకకి రాలేకపోయారు. ఆ లోటుని పవన్‌కల్యాణ్‌ బాబాయ్‌ తీర్చారు. డాడీ తర్వాత నేను కాదు.. ఆ స్థానం పవన్‌ బాబాయ్‌దే. ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను'' అంటూ రామ్ చరణ్ అ న్న మాటలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం 'నాయక్‌' ఆడియో పంక్షన్ లో నిన్న సాయింత్రం జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఉద్వేగంగా ఈ మాటలను అన్నారు.

  అలాగే డాడీ టాప్ పొజీషన్ లో ఉన్నప్పుడు ఎవరూ మాట వినకుండా ఎవరూ మాట పట్టింటుకోకుండా.. కేవలం కష్టపడి ఎవరి డే షూటింగ్ తప్ప వేరే ధ్యాస లేనప్పుడు డాడీ వెనకాల ఓ పెద్ద గజ స్ధంబంలా... ఓ పర్వతం లాగ ఓ పవర్ ఫుల్ ఫోర్స్ లాగ పవన్ బాబాయ్ నించునేవాడు. డాడీకి ఏది ఎదురొచ్చినా... ఫస్ట్ అన్నయ్యతో కాదు నాతో మాట్లాడు...ఆయనవరకూ వెళ్ళక్కర్లేదు..అనే ఆరా..కళ్యాణ్ బాబాయ్ క్రియేట్ చేసాడు. ఇవ్వాళ కళ్యాణ్ బాబాయ్ ..డాడీ పొజీషన్ లో కూర్చున్నాడు. ఆయన ఎవరకీ సమాధానం చెప్పే అవసరం లేదు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ ని ఎవరైనా ఏదైనా అంటే..ముందు వచ్చి నాతో మాట్లాడండి అంటా...ఈ ఆడియోకి బాబాయ్ వచ్చారు..మాకందరికీ ఆనందంగా ఉంది..మీకూ ఆనందంగా ఉంది..ఈ విషయంలో నేను ఒకటి చెప్తున్నాను...మీకైతే కాదు...ఇంతకు ముందు పంక్షన్ లో బాబాయ్ రానప్పుడు అనవసరంగా రాసారు..ఈ వేదిక ఏదన్నా ఒక మీటరా...ఈ వేదిక మీద ఫ్యామిలీ అంతా కనిపిస్తేనే ప్రేమ ఉన్నట్లు అని రాసి ఉందా ఎక్కడైనా... ఎవరు చెప్పారు.... మా నాన్నకీ, బాబాయ్‌కీ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో, నాకూ బాబాయ్‌కీ మధ్య ఎలాంటి ప్రేమ ఉందో మాకే తెలుసు.

  నేను చేయబోయే తరువాత సినిమా పాటల వేడుకకు కూడా మా బాబాయ్‌ రాకపోవచ్చు. బోల్డు కారణాలు ఉంటాయి... రాకపోవటానికి... మరి అది ఒక రీజన్ గా తీసుకుని మీడియాలో రాయటం చాలా తప్పు.అంతమాత్రానికే మా మధ్య ప్రేమ లేదనుకోవద్దు. ఇలాంటి లేనిపోని కథనాలు వస్తే నేను పట్టించుకోను. రాసినా నాకు వెంట్రుక... ఎవరకీ సమాధానం చెప్పక్కర్లేదని చెప్పింది కళ్యాణ్ బాబాయ్..రచ్చ ఆడియో అయిన వెంటనే బాబాయ్ ఫోన్ చేసి... నేను ఎందుకు రచ్చకు రాలేదో.. నీకు తెలుసు.. నాకు తెలుసు... ఎవరకీ సమాధానం చెప్పకు చరణ్ అన్నారు. నేను ఎందుకు ఈ టాపిక్ ఎత్తానంటే మెగాఫ్యాన్స్ కి తెలియాలనే తప్ప... మిమ్మల్ని, మమ్మల్నందిరినీ ఎవరూ విడకొట్టలేదు.. ఓ పత్రిక, ఓ టీవీ ఛానెల్ విడకొట్టలేరు.... 37యేళ్లుగా మా మధ్య ఉన్న అనుబంధాన్ని ఏ ఛానల్‌ కూడా విడదీయలేదు అని తెలియచేసారు.

  కాజల్‌, అమలా పాల్‌ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. తమన్‌ స్వరాలు సమకూర్చారు. సోమవారం హైదరాబాద్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి సీడీని పవన్‌కల్యాణ్‌ ఆవిష్కరించారు. చిరంజీవి సతీమణి సురేఖ స్వీకరించారు.

  English summary
  “The relation between us and our fans is very strong. A news paper or a TV channel cannot separate us,” Charan said. Charan’s speech has shell shocked everyone as he didn’t mince with his words. Challenging media in a strong tone is a rare sight at film functions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X