»   » పదేళ్లయింది: రామ్ చరణ్ గురించి ఉపాసన ఇలా...

పదేళ్లయింది: రామ్ చరణ్ గురించి ఉపాసన ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చి నేటితో పదేళ్లు పూర్తయింది. ఆయన నటించిన తొలి చిత్రం 'చిరుత' సెప్టెంబర్ 28, 2007న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన చరణ్ తర్వాత 'మగధీర' సినిమాతో స్టార్ హీరో అయ్యాడు.

రామ్ చరణ్ ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. రామ్ చరణ్ ను అభిమానిస్తున్న వారికి ఆమె థాంక్స్ చెప్పారు. తన భర్త గురించి ఉపాసన ఇలా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

రామ్ చరణ్ కఠినశ్రమ

హీరోగా ఎదిగే క్రమంలో రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. ఎంతో కష్టపడితే తప్ప... రక్తం చిందిస్తే తప్ప స్టార్ ఇమేజ్ రాలేదు. పైకి చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో ఈజీగా అడుగు పెట్టారనే వాదన ఉన్నప్పటికీ..... ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడాని, తండ్రికి తగిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి చరణ్ కఠినంగా శ్రమించాడు.

మగధీరలో భారీ ప్రమాదం నుండి తప్పించుకుని

మగధీరలో భారీ ప్రమాదం నుండి తప్పించుకుని

చరణ్ మగధీర షూటింగ్ సమయంలో అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. సినిమాలో గుర్రపు స్వారీ చేస్తుండగా మొహానికి గుడ్డపడే సీన్ ప్లాన్డ్ కాదు, యాక్సిడెంటల్ గా జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఒక వేళ ఏమైనా అయ్యింటే రామ్ చరణ్ లైఫ్ మరోలా ఉండేదేమో. అలాంటి ఎన్నో రిస్కులు చేసి చరణ్ ఈ స్థాయికి ఎదిగాడని చెబుతుంటారు బాబాయ్ నాగబాబు.

Ram Charan Wife Upasana bringing a big smile on the girls faces :Watch Here
తండ్రే ఆదర్శం

తండ్రే ఆదర్శం

చిన్న తనం నుండి తండ్రి సినిమాలను గమనిస్తూ వచ్చిన చరణ్ తాను కూడా సినిమా హీరో కావాలనే లక్ష్యంతో ఎదిగాడు. విభిన్నమైన సినిమాలు చేస్తూ చాలా కష్టపడుతున్నాడు.

నిర్మాతగా, హీరోగా

నిర్మాతగా, హీరోగా

రామ్ చరణ్ కేవలం హీరోగా మాత్రమే కాదు నిర్మాతగానూ తన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన ‘కొణిదెల ప్రొడక్షన్స్' బేనర్లో తొలి సినిమాగా ‘ఖైదీ నెం 150' చిత్రాన్ని తీసిన చరణ్ భారీ విజయం అందుకున్నారు. ప్రస్తుతం రెండో సినిమాగా ‘సై రా నరసింహారెడ్డి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

రంగస్థలం

రంగస్థలం

మరో వైపు రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడి పాత్రలో డిఫరెంటుగా కనిపించబోతున్నారు.

English summary
Mega Power Star Ram Charan Completed ten years in the film industry. His debut film 'Chirutha' released on September 28, 2007.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu