»   »  చిరంజీవి 150 వ సినిమాలో కీ రోల్ లో నేను

చిరంజీవి 150 వ సినిమాలో కీ రోల్ లో నేను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: చిరంజీవి 150 వ చిత్రం గురించి రామ్ చరణ్ మరోసారి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..."ఇది ఆయన సినిమానే పూర్తిగా... కానీ నేనూ ఆ సినిమాలో ఉంటాను...కథలో ప్రధానమైన పాత్రలో కనిపిస్తాను...నాన్న ఆయన కోసమే రాసిన సెంట్రల్ పాత్రలో కనిపిస్తారు... ." అని రామ్ చరణ్ చెప్పారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక,,,

త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్లో చిరుదోశ లభిస్తుందని రామ్ చరణ్ తెలియచేసారు. చిరుదోశకు పేటెంట్‌ వచ్చిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ వంటకాన్ని అందించనున్నట్లు తెలిసింది. దోశలో పల్లీల పచ్చడితో పాటు శాకాహార, మాంసాహార కూరలను కూడా అందివ్వనున్నట్టు సమాచారం. అంతేగాక తక్కువ ధరకే నాణ్యమైన వంటకాలను కూడా వినియోగదారులకు అందించనున్నట్లు తెలియచేసారు.

చిరుదోశ' కి పేటెంట్‌

చిరంజీవి 60వ జన్మదినోత్సవం ఇటీవలే వైభవంగా జరిగింది. అయితే ఈసారి తన తండ్రికి పుట్టినరోజు కానుకగా 'చిరుదోశ' పేటెంట్‌ను బహుకరించనున్నట్లు చెర్రీ తెలిపారు. చిరంజీవి ప్రత్యేకంగా తయారు చేయించుకునే దోశకు 'చిరుదోశ' పేరుతో పేటెంట్‌కు దరఖాస్తు చేసినట్లు చరణ్‌ వెల్లడించారు.

 Ram charan confirms to act in Chiru150

చిరుదోశ' అలా పుట్టింది

నూనె లేకుండా మెత్తగా ఉండేలా తయారు చేసిన దోశలో వెజిటెబుల్‌ కర్రీ, పప్పు చట్నీ(వేరుశెనగ) ఉంటుంది. ఈ దోశకు చిరుదోశగా నామకరణం చేసి పేటెంట్‌ పొందేలా ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రత్యేకమైన దోశను 25 ఏళ్ల క్రితం మైసూర్‌లో సినిమా షూటింగ్‌ సందర్భంగా ఒక దాబా దగ్గర చిరంజీవి రుచి చూశారట.

ఆ దాబా వారు దాని తయారీని వెల్లడించలేదని చరణ్‌ తెలిపారు. అదే రుచిని తమ ఇంట్లో చాలా సార్లు ప్రాక్టీస్‌ చేశామని చివరికి అలాంటి రుచినే చిరు ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్రత్యేక దోశకు పేటెంట్‌ తీసుకొచ్చి తన తండ్రికి జన్మదిన కానుకగా ఇస్తానని చరణ్‌ పేర్కొన్నారు.

పుట్టిన రోజు కానుక ఇది

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు రాంచరణ్‌ వినూత్న రీతిలో ఆయనకు బహుమతులు అందిస్తుంటం ఆనవాయితీ. ఈ సారి సరికొత్త బహుమతిని తండ్రికి ఇచ్చానని చెపుతున్నారు.

రామ్ చరణ్ తాజా చిత్రం విషయానికి వస్తే...

"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.

విడుదలైన మూడు రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించి చెర్రీ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ముందుకు వెల్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు.

English summary
Not only producing Chiranjeevi’s 150th film, Ram Charan is going to play one of the vital characters in this film. He also added that “It will be his show all the way. I will be in the film, but will only play one of the principal characters. Dad will be the central character in an author-backed role.”
Please Wait while comments are loading...