»   »  రామ్ చరణ్ సేవ: చిరంజీవి ట్రస్ట్, అపోలో సపోర్టుతో

రామ్ చరణ్ సేవ: చిరంజీవి ట్రస్ట్, అపోలో సపోర్టుతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. తాజాగా చిన్న పిల్లల ఆరోగ్యంపై రామ్ చరణ్ దృష్టి సారించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, అపోలో హాస్పిటల్ సపోర్టుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిల్లల హెల్త్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు.

రామ్ చరణ్ తండ్రి చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలను రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కామినేని కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఈ విషయం గురించి రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

Ram Charan Extends His Charity For Child Health Care

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, అపోలో హాస్పటల్ సంయుక్తంగా చిల్డ్రన్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 డిపరెంట్ లోకేషన్లలో ఈ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఏ చిన్నారికి ఆరోగ్య సమస్య ఉన్నా మేము అక్కడ అంటెండ్ అవుతామని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ బాధ్యతలను కూడా రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ మాట్లాడుతూ...2.65 లక్షల బ్లడ్ శాంపిల్స్ సేకరించాం. దాదాపు 8 లక్షల మందిని కాపాడగలిగామని తెలిపారు.

English summary
While, the birthday of Mega Powerstar Ram Charan is around the corner, the charity works have kick started in a massive way. This time the star has decided to extend his support to child health care.
Please Wait while comments are loading...