twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెక్ పోస్ట్ వద్ద రాంచరణ్ విధ్వంసం, వందల మందితో.. ఎన్టీఆర్ తొలిసారి!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న నటించిన చిత్రం వినయ విధేయ రామ సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. వినయ విధేయ రామ చిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేదు. దీనితో చరణ్ ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పేశాడు. ఇప్పుడు తన దృష్టిని మొత్తం రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ పై పెట్టాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ గురించి కళ్ళు చెదిరే వార్తలు వినిపిస్తున్నాయి.

    మొదలుపెట్టిన రాజమౌళి

    మొదలుపెట్టిన రాజమౌళి

    రాజమౌళి సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం నవంబర్ లో ప్రారంభం అయింది. కాగా ఇటీవల రాజమౌళి సెకండ్ షెడ్యూల్ ప్రారంభించాడు. సెకండ్ షెడ్యూల్ లో అసలు సిసలైన షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రయూనిట్ తెరకెక్కిస్తోంది. మొన్నటివరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరగగానే ఇటీవల చిత్ర యూనిట్ ఆర్ఎఫ్ సి కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.

    రాంచరణ్ ఫైట్

    రాంచరణ్ ఫైట్

    ఆర్ఎఫ్ సి లో లో రాజమౌళి రాంచరణ్ పై పోలీస్ చెక్ పోస్ట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఈ చిత్రంలో పోలీసుగా నటిస్తున్నాడు. రాంచరణ్, వందలాది మంది ఫైటర్ల మధ్య చెక్ పోస్ట్ వద్ద భారీ పోరాట సన్నివేశం జరుగుతోంది. ఈ సీన్ లో రాంచరణ్ కళ్ళు చెదిరే స్టంట్స్ పెర్ఫామ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మగధీర చిత్రంలో 100 మందితో రాంచరణ్ ఫైట్ సీన్ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే.

    తొలిసారి ఎన్టీఆర్ లేకుండా

    తొలిసారి ఎన్టీఆర్ లేకుండా

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలసి ఈ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు వీరిద్దరూ కలసి నటించే సన్నివేశాలు ఉండేవి. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలయ్యాక తొలిసారి ఎన్టీఆర్ లేకుండా చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్ కు రాజమౌళి కొద్దిగా బ్రేక్ఇ చ్చాడు. ప్రస్తుతం చరణ్ ఒక్కడే షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

    పీరియాడిక్ డ్రామా

    పీరియాడిక్ డ్రామా

    స్వాతంత్ర సమరం నేపథ్యంలో 1920 కాలం నాటి పరిస్థితుల్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బందిపోటుగా, రాంచరణ్ పోలీసుగా నటిస్తున్నారు. పునర్జన్మలకు సంబంధించిన అంశం కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ భారీ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నా ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Ram Charan fighting with hundreds of fighters in RRR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X