»   » 'థాంక్యూ శ్రీను వైట్ల గారు!' అంటూ రామ్ చరణ్

'థాంక్యూ శ్రీను వైట్ల గారు!' అంటూ రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ ఇప్పుడు తన అభిమానులకు తన తాజా చిత్రం అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్నాడు. తాజాగా ఆయన తను శ్రీను వైట్ల తో చేస్తున్న చిత్రం ఎంతవరకూ వచ్చిందో తెలియచేస్తూ...దర్శకుడు శ్రీను వైట్లకు ధాంక్స్ చెప్పారు. ఇదంతా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి చేసి, అభిమానులను అలరించారు. ఇంతకీ ఆయన రాసిందేమిటి..ఈ క్రింద చదవండి.

Hello...Done with 2 songs,interval fight & few scenes already..i love the energy of our new team.im glad I'm doin this film. Thank you Srinu Garu..

Posted by Ram Charan on 15 June 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘నా నెక్స్ట్ సినిమాలో ఇప్పటికే రెండు పాటలను, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ మరియు కొన్ని సన్నివేశాలను షూట్ చేసాం. నా న్యూ టీం ఎనర్జీ విషయంలో నేను చాలా హ్యాపీ గా ఉన్నాను.. థాంక్యూ శ్రీను వైట్ల గారు' అని రామ్ చరణ్ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసారు.

చిత్రం పూర్తి వివరాల్లకి వెళితే...

రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్ర టీం స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో రెండు పాటల షూటింగ్ ని పూర్తి చేసుకొని వచ్చారు.

Ram Charan gives update on Vytla’s movie

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు.

ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేయాల్సి ఉంటుందట. దీన్నిబట్టి అటు ఫైట్లు, ఇటు డ్యాన్సులు అదిరిపోయేలా ఉంటాయని అర్థమవుతోంది. తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
“Hello. Done with 2 songs, interval fight & few scenes already. I love the energy of our new team. I’m glad I'm doing this film. Thank you Srinu Garu”, said Charan, talking about the movie. Charan-Vaitla film will be hitting cinemas on Dasara eve.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu