»   » బాబాయ్ పవన్ బేనర్లో సినిమా.... ‘ధృవ’ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ (ఫోటోస్)

బాబాయ్ పవన్ బేనర్లో సినిమా.... ‘ధృవ’ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో తెరకెక్కిన చిత్రం 'ధృవ'. అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... సినిమాకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్నారు. దీంతో పాటు చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన విశేషాలు కూడా పంచుకున్నారు.


రీమేక్ అయితే ఏంటి? అదీ సినిమానే కదా

రీమేక్ అయితే ఏంటి? అదీ సినిమానే కదా

రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌దు, కొత్త క‌థ‌లే చేయాల‌నే ప‌ట్టింపులు ఏమీ లేవు. క‌థ బావుంటే ఆ క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపిస్తే బావుంటుంది కదా అని రీమేక్ చేస్తాం. రీమేక్ చేసినా అది సినిమాయే క‌దా అంటూ..... రీమేక్ అంశంపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.


ఆయన వల్లే ఈ సినిమా చేసా..

ఆయన వల్లే ఈ సినిమా చేసా..

ధృవ సినిమా చేయ‌డానికి కార‌ణం ఎన్‌.వి.ప్ర‌సాద్‌గారు. ఆయ‌న క‌థ న‌చ్చి సినిమా చేయ‌మ‌ని అడిగారు. ప్ర‌సాద్‌గారు సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్‌, ప‌క్కా మాస్ ప‌ల్స్ తెలిసిన నిర్మాత‌. అటువంటి ఆయ‌నే ఈ క‌థ‌ను నేను యాప్ట్ అవుతాన‌ని భావించి న‌న్ను అడిగిన‌ప్పుడు నేనెందుకు సినిమా చేయ‌కూడ‌ద‌నిపించి సినిమా చేశాను.


అరవింద్ స్వామి గురించి....

అరవింద్ స్వామి గురించి....

అర‌వింద్‌స్వామిగారితో యాక్ట్ చేయ‌డానికి ముందు కాస్తా టెన్ష‌న్ ప‌డ్డాను. ఆయ‌న‌కేమో అల‌వాటైన సీన్స్‌, అల్రెడి త‌మిళంలో ఆయ‌న ప్రూవ్‌డ్, నేనెమో కొత్త‌గా చేయాలి క‌దా అనుకున్నాను. కానీ అర‌వింద స్వామిగారు కొత్త క్యారెక్ట‌ర్ చేస్తున్న‌ట్లు ఫీలై చేయ‌డంతో నాకు టెన్ష‌న్ త‌గ్గిందని రామ్ చరణ్ తెలిపారు.


సిద్ధార్థ్ పాత్ర‌కు ఆయన తప్ప మరో ఆప్షన్ లేదు

సిద్ధార్థ్ పాత్ర‌కు ఆయన తప్ప మరో ఆప్షన్ లేదు

ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్ర‌ను అర‌వింద్‌స్వామిగారే చేయాలి. వేరే ఆప్ష‌న్స్ లేవు. అది కాకుండా తెలుగు ప్రేక్ష‌కులు అర‌వింద‌స్వామిగారిని తెర‌పై చూసి చాలా కాలం కావ‌డంతో ఆయ‌న్నే అప్రోచ్ అయ్యాం. ఆయ‌న కూడా ఒప్పుకున్నారు అని చెర్రీ తెలిపారు.


సూరి ముందు ఆసక్తి చూపలేదు, నా కోసం చేసారు

సూరి ముందు ఆసక్తి చూపలేదు, నా కోసం చేసారు

సురేంద‌ర్‌రెడ్డిగారు త‌న సొంత క‌థ‌తో సినిమా చేయాల‌నుకున్నారు. ముందు రీమేక్ పై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. నేను క‌థ న‌చ్చి చేయమ‌ని అడ‌గంతో నా కోసం చేసారు. ఆయ‌న క‌థ‌ను ఓన్ చేసుకుని సినిమా చేశారు. తమిళం కంటే బాగా చేసారని నా ఫీలింగ్... ఆ ఫీల్ ప్రేక్షకులకు కలుగుతుందని భావిస్తున్నట్లు చరణ్ తెలిపారు.


నిర్మాతగా చిరు 150 గురించి...

నిర్మాతగా చిరు 150 గురించి...

నాన్నగారి సినిమాను నేను ప్రొడ్యూస్ చేయడం నా జీవితంలో మరిచిపోలేని విషయం. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. వినాయక్ గారు దర్శకుడు కావడంతో ఉండటంతో నాకు చాలా ఈజీ అయింది. ప్రస్తుతానికి టాకీ పార్ట్ అంతతా పూర్త‌య్యింది. రామోజీ ఫిలింసిటీలో సాంగ్ షూట్ చేస్తున్నాం. సాంగ్ రేపో, ఎల్లుండో అయిపోతుంది అన్నారు.


ఖైదీ రిలీజ్ గురించి

ఖైదీ రిలీజ్ గురించి

ఖైదీ ఆడియో క్రిస్మ‌స్ స‌మ‌యంలో రిలీజ్ చేసి, జ‌న‌వ‌రి 11 లేదా 12న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి ప్లాన్ చేస్తున్నాను. ఈ ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంలలో ఓ సాంగ్‌లో ఓ బి.జి.ఎంలో నేను క‌న‌ప‌డ‌తాను అని రామ్ చరణ్ తెలిపారు.


సుకుమార్, మణిరత్నం, కొరటాల శివతో తర్వాతి సినిమాలు

సుకుమార్, మణిరత్నం, కొరటాల శివతో తర్వాతి సినిమాలు

సుకుమార్‌ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా సంక్రాంతి త‌ర్వాత ప్రారంభం అవుతుంది. అలాగే మ‌ణిర‌త్నంగారితో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. క‌థ ఓకే అయితే వ‌చ్చే ఏడాది ఆయ‌న‌తో సినిమా ఉంటుంది. అలాగే కొర‌టాల శివ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంది.


బాబాయ్ బేనర్లో సినిమా

బాబాయ్ బేనర్లో సినిమా

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు ప్ర‌స్తుతం ఉన్న క‌మిట్‌మెంట్స్ పూర్తి చేస్తున్నారు. అలాగే ఈలోపు నేను కూడా నా క‌మిట్‌మెంట్స్ పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న బ్యాన‌ర్‌లో సినిమా చేస్తాను. అందుకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు రామ్ చరణ్.


English summary
Ram Charan acted Dhruva Movie releasing on 9th Dec in this connection he had chit chat with media today in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu