»   » నాన్నగారు అలా అనడంతో...నా కళ్లలో నీళ్లు తిరిగాయి: రామ్ చరణ్

నాన్నగారు అలా అనడంతో...నా కళ్లలో నీళ్లు తిరిగాయి: రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.... ఆ మధ్య వరుస ప్లాపులతో ఇబ్బంది పడ్డాడు. గ్యాప్ తీసుకున్నా మంచిదే ఒక మంచి చిత్రంతో వచ్చి హిట్ అందుకోవాలనే సంకల్పంతో 'ధృవ' సినిమా చేసారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. తను పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కడంతో రామ్ చరణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

రామ్ చరణ్ కెరీర్లో మగధీర పెద్ద హిట్. ఆ సినిమా తర్వాత చరణ్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రంగా 'ధృవ' పలు రికార్డులతో బాక్సాఫీసు వద్ద దూసుకోలుతోంది. ఈ విజయంతో మంచి ఊపు మీద ఉన్న చరణ్ ప్రముఖ తెలుగు పత్రిక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.

నాన్నగారు అలా అనడంతో... కళ్లలో నీళ్లు

నాన్నగారు అలా అనడంతో... కళ్లలో నీళ్లు

‘ధృవ' సినిమాలో కథే హీరో....ఓ బలమైన కథలో నటించడం వల్లే నాకు ఏ సినిమాకీ రానన్ని ప్రశంసలు వస్తున్నాయి. సాధారణంగా నాన్నగారు నా సినిమాలు చూశాక డ్యాన్స్‌ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చెబుతుంటారు. కానీ ‘ధృవ' విషయంలో మాత్రం నా నటన గురించి మాట్లాడారు. కథకీ, పాత్రకీ ఎంత కావాలో అంత పర్‌ఫెక్ట్‌గా చేశావని మెచ్చుకొన్నారు. ఆ మాట విన్నప్పుడు ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

నిర్మాతగా

నిర్మాతగా

నాన్నగారి సినిమాతో నిర్మాతని కావడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఖైదీ నంబర్‌ 150' విడుదలకి సిద్ధమవుతోంది. పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేసి, జనవరి తొలి వారంలో ప్రీ రిలీజ్‌ వేడుకని నిర్వహించబోతున్నాం. ఇకపై కూడా నిర్మాతగా వరుసగా సినిమాలు చేసే ఆలోచన ఉందిని పత్రిక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

నెక్ట్స్ సుకుమార్ మూవీలో

నెక్ట్స్ సుకుమార్ మూవీలో

త్వరలో సుకుమార్ మూవీలో నటించబోతున్నాను. అదొక కొత్త రకమైన సినిమా. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఆ కథలో నేను గెడ్డంతో కనిపిస్తా. మరో నెల రోజులపాటు గెడ్డం పెంచి ఆ తర్వాత సినిమాని మొదలుపెడతామని రామ్ చరణ్ తెలిపారు.

నాకు మాత్రమే ఆ అవకాశం దక్కింది

నాకు మాత్రమే ఆ అవకాశం దక్కింది

నాన్నగారి 150వ సినిమాలో ఒక సీన్లో అయినా నటించాలని మా కుటుంబంలోని స్టార్స్ అంతా కోరుకున్నారు. అయితే నాకు మాత్రమే అవకాశం దొరికింది. ఒక పాటలో ముప్పై సెకన్లపాటు నేను కనిపిస్తా. నాన్నతో కలిసి ఓ కొత్త సిగ్నేచర్‌ స్టెప్పు వేశాను అని రామ్ చరణ్ తెలిపారు.

సల్మాన్ అడగటంతో తప్పలేదు

సల్మాన్ అడగటంతో తప్పలేదు

‘ధృవ' కోసం సిక్స్‌ ప్యాక్‌ చేయడంలో సల్మాన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ రాకేష్‌ ఉడియార్‌ సహకరించారు. సల్మాన్‌ పెద్దన్నలాంటివాడు. ఆయనే నాకు రాకేష్‌ని పరిచయం చేశారు. ఆమధ్య సానియా మీర్జా ఇంట్లో జరిగిన ఓ వేడుకకి సల్మాన్‌ఖాన్‌ హాజరయ్యారు. నన్ను చూసి ‘కండలు పెంచావట కదా, చూపించు' అన్నారు. నేను మొహమాటపడ్డా. ‘కండలు పెంచితే చూపించాలి కానీ, దాచుకోకూడదు' అన్నారు. అపుడు అందరి ముందూ కండలు చూపించక తప్పలేదు. నా కండలు సల్మాన్ మెచ్చుకున్నారు. కండలు పెంచడం కంటే వాటిని అలా కాపాడుకోవడం ఇంకా కష్టమని రామ్ చరణ్ తెలిపారు.

ఆ ఊసు మీకెందుకు?? ...దిమ్మ తిరిగేలా రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్

ఆ ఊసు మీకెందుకు?? ...దిమ్మ తిరిగేలా రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్

మెగా హీరోలంతా వరస పెట్టి రీమేక్ లు చేస్తున్న మాట నిజం. అంతెందుకు మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెం 150' సినిమాతో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఆ సినిమాలో... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Ram Charan interview about Dhruva movie. Dhruva is a 2016 Indian Telugu-language film directed by Surender Reddy and produced by Allu Aravind under his banner Geetha Arts. It features Ram Charan, Arvind Swamy and Rakul Preet Singh in the lead roles. It is a remake of Tamil film Thani Oruvan (2015). The movie was released worldwide on 9 December 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu