»   » 8 రోజులు. 54 కోట్లు.. తండ్రి కోసం రాంచరణ్ భారీ సాహాసం!

8 రోజులు. 54 కోట్లు.. తండ్రి కోసం రాంచరణ్ భారీ సాహాసం!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సైరా నర్సింహారెడ్డి చిత్రాన్ని కొణిదెల బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రాంచరణ్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. స్వాత్రంత్య పోరాట యోధుడి పాత్రను తండ్రి స్టామినాకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ ఎంతన్నది ముఖ్యం కాదు. ఏ రేంజ్‌లో చేశామా అనేదే ప్రధానం అని ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే..

   జార్జియాలో ప్రతిష్ఠాత్మకంగా

  జార్జియాలో ప్రతిష్ఠాత్మకంగా

  జార్జియాలో సైరా నర్సింహారెడ్డి చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆయువుపట్టుగా మారిన కీలక సన్నివేశాల విషయంలో రాంచరణ్ రాజీ పడటం లేదనే విషయం ప్రధానంగా చర్చనీయాంశమైంది.

  8 నిమిషాలు కోసం 54 కోట్లు

  8 నిమిషాలు కోసం 54 కోట్లు

  జార్జియాలో ప్రస్తుతం చిత్రీకరిస్తున్న యుద్ద సన్నివేశాల కోసం రాంచరణ్ దాదాపు రూ.54 కోట్లను ఖర్చు చేస్తున్నారట. ఈ యుద్ధ సన్నివేశాలు సినిమాలో సుమారు 8 నిమిషాల నిడివి ఉంటుందట.

  1000 మందితో యుద్ధ సన్నివేశాలు

  1000 మందితో యుద్ధ సన్నివేశాలు

  సైరా చిత్రంలోని యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్ నుంచి జార్జియాకు 150 మంది తరలివెళ్లారు. అక్కడ మరో 600 మందికిపైగా షూటింగ్ కోసం నియమించుకొన్నారు. దీని కోసం భారీగా ఖర్చు జరిగినట్టు తెలిసింది.

  సైరాలో అమితాబ్

  సైరాలో అమితాబ్

  సైరా నర్సింహారెడ్డిలో చిరంజీవితోపాటు నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, తమన్నా భాటియా, విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్‌ను అందిస్తున్నారు.

  English summary
  Tollywood Megastar Chiranjeevi will appear as a freedom fighter in his upcoming movie Syeraa Narasimha Reddy. As a producer Ram Charan is paying through the nose for his father's movie. The war sequence which is being shot in Georgia currently cost nearly Rs 54 crore for Ram Charan. A dedicated team which includes 150 members from Hyderabad flew to Georgia. Also, the makers have hired around 600 local artists to participate in the shooting for Sye Raa Narasimha Reddy.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more