twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్ : జపాన్‌లో చరణ్ బిస్కెట్ల రహస్యం ఇదే!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేరు మీద జపాన్ దేశంలో బిస్కట్ ప్యాకెట్లు వెలుగు చూడటంతో కొన్ని రోజు క్రితం పాఠకుల దృష్టికి తెచ్చాం. Ezaki Glico Co., Ltd అనే కంపెనీ ఈ బిస్కెట్లు తయారు చేసింది. అయితే తాజాగా ఈ విషయానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    ఈ కంపెనీ 2,460 యెన్లు(దాదాపుగా రూ. 1500) చార్జితో....మనం ఎవరి ఫోటో ఇస్తే వారి ఫోటోలతో బిస్కెట్ ప్యాకెట్లు తయారు చేసి ఇస్తుంది. పెళ్లి రోజు, పుట్టిన రోజు లాంటి సందర్భాల్లో ఇలాంటి తయారు చేయించి గిఫ్టుగా ఇస్తుంటారట జపనీయులు. http://s-bisco.jp/ అనే వెబ్ సైట్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

    మరి అక్కడ రామ్ చరణ్ పేరుతో ఈ బిస్కెట్లు తయారు చేయించింది ఎవరో? కానీ......చాలా లేటుగా అసలు విషయం బయట పడింది. గతంలో మగధీర చిత్రం జపాన్లో విడుదల కావడంతో బహుషా ఎవరైనా అభిమానంతో చరణ్ పేరుతో ఈ బిస్కెట్లు తయారు చేయించారేమో...?

    రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' షూటింగులో పాల్గొంటున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ మూవీ 'జంజీర్' త్వరలో తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.

    English summary
    Ezaki Glico Co., Ltd, one of the leading Food manufacturing company, a Japanese confectionery company has chosen Mega Power star Ram Charan for its cream biscuit pack cover. Actually, a local website (http://s-bisco.jp/) in Japan is heard of printing personalized biscuit packets if we pay a sum of 2460 Yens (Rs.1500). Anyone who pays this amount can have their picture on the biscuit packet. So, Ram Charan on their biscuit packet means someone has paid the money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X