»   »  జిమ్‌లో దొరికిపోయిన రామ్ చరణ్, కాజల్, కృష్ణవంశీ (ఫోటోస్)

జిమ్‌లో దొరికిపోయిన రామ్ చరణ్, కాజల్, కృష్ణవంశీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరి వాడేలే'. కాజల్ హీరోయిన్‌. తాజాగా ఈ ముగ్గురు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటో ఒకటి అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. సినిమాలో ఈ ఇద్దరి లుక్ ఎంతో బాగుందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

'గోవిందుడు అందరివాడేలే' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ ని కృష్ణ వంశీ పుట్టిన రోజు(జులై 28) సందర్భంగా ఈ రోజు విడుదల చేద్దామనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీలుకాలేదు. దీంతో టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున(ఆగస్టు 22న) విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

భారీ తారాగణంతో కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈచిత్రంలో రామ్ చరణ్ తాత పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్‌కు జోడీగా జయసుధ నటిస్తోంది. మరో నటుడు శ్రీకాంత్ రామ్ చరణ్ బాబాయ్ పాత్రలో నటిస్తుండగా అతనికి జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నపారు. స్లైడ్ షోలో ఫోటోలు....

జిమ్‌లో రామ్ చరణ్, కాజల్, కృష్ణ వంశీ

జిమ్‌లో రామ్ చరణ్, కాజల్, కృష్ణ వంశీ


జిమ్‌లో కసరత్తులు చేస్తున్న రామ్ చరణ్, కాజల్, కృష్ణ వంశీ తదితరులు....

విడుదల తేదీ...

విడుదల తేదీ...


‘గోవిందుడు అందరివాడేలే చిత్రం రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. అక్టోబర్ 1న విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్ కావడంతో రామ్ చరణ్ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు.

ఫ్యామిలీ ఎంటర్టెనర్

ఫ్యామిలీ ఎంటర్టెనర్


ఈ చిత్రంలో చరణ్‌ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు.

మెయిన్ టెక్నీషియన్స్

మెయిన్ టెక్నీషియన్స్


ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

రామ్ చరణ్ న్యూ లుక్

రామ్ చరణ్ న్యూ లుక్


చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి ప్రకాష్ రాజ్ తో తిరుగుతూ కనిపిస్తాడు.

English summary

 Mega Power Star Ram Charan Tej and Kajal Agarwal are currently acting in 'Govindhudu Andarivadele' which is directed by Krishna Vamsi. The trio posed for the camera holding dumbbells in their hands while doing workouts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu