»   » రామేశ్వరంలో రామ్‌చరణ్‌ రచ్చ

రామేశ్వరంలో రామ్‌చరణ్‌ రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామేశ్వరంలో జరుగుతోంది. చిత్ర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయంటున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్‌, పొల్లాచ్చిలోనూ త్వరలో చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.

కృష్ణవంశీ. ఆయన మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు.పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించి రీసెంట్ గా ప్రారంభం జరిగింది. తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
Ram Charan and Kajal Agarwal have headed to Rameswaram for a new schedule shoot for their upcoming film being directed by Krishna Vamsi. The yet-to-be titled movie is being canned in the beautiful picturesque locales of Rameswaram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu