twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్‌ను చీఫ్ గెస్టుగా ఎంపిక చేసారు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బండ్ల గణేష్ కాంబినేషన్లో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు బండ్ల గణేష్ నిర్మాతగా 'నీ జతగా నేనుండాలి' అనే చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఈచిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 14న ప్లాన్ చేసారు. ఈ ఆడియో వేడుకకు రామ్ చరణ్‌ చీఫ్ గెస్టుగా హాజరై ఆడియో విడుదల చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈ వేడుక జరుగనుంది.

    హిందీలో సూపర్ హిట్టయిన 'ఆషిఖి-2' చిత్రానికి ఇది రీమేక్. రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రంలోని 'నీ జతగా నేనుండాలి' అనే పాటనే ఈ చిత్రం టైటిల్‌గా సెట్ చేసారు. 'బంపర్ ఆఫర్' ఫేం జయరవీంద్ర ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో సచిన్ జోషి, నిర్మాత బండ్ల గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ హిందీ వెర్షన్ పోస్టర్ కు డిట్టో ఉండటం గమనార్హం. దీన్ని బట్టి సినిమా కూడా సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ అలానే తెరకెక్కిస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    Ram Charan to launch Nee Jathaga Nenundali audio?

    హీరో విషయానికొస్తే....గతంలో తెలుగులో నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, మిత్రుడు చిత్రాల్లో నటించాడు. ఇక హీరోయిన్ నాజియా హుస్సేన్ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ బంధువు. దర్శకుడు జయరవీంద్ర గతంలో బంపర్ ఆఫర్(సాయిరామ్ శంకర్)తో చేసి హిట్ కొట్టారు. అలాగే అదే సాయిరామ్ శంకర్ తో చేసిన దిల్లున్నోడు చిత్రం రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ అయ్యింది.

    ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషికి చెందిన వికింగ్‌ మీడియా, బండ్ల గణేష్‌ కు చెందిన పరమేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మిస్తున్నారు. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అంతటా వినిపిస్తోంది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే...ఓ క్యాషియర్ గా వ్యవరిస్తున్నాడని అంటున్నారు.

    English summary
    Source said that mega power star Ram Charan might be the chief guest for Nee Jathaga Nenundali audio release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X