»   » సంక్రాంతి అది హిట్టయితేనే... రామ్ చరణ్‌తో చాన్స్!

సంక్రాంతి అది హిట్టయితేనే... రామ్ చరణ్‌తో చాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బ్రూస్ లీ' సినిమా పరమ ప్లాప్ కావడంతో రామ్ చరణ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ సినిమా రీమేక్ కు కమిట్ అయ్యాడు తమిళంలో హిట్టయిన ‘థాని ఓరువన్' చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు.

కాగా...రామ్ చరణ్ ఇటీవల దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన కథ విన్నాడట. ఆయన చెప్పిన స్క్రిప్టు చెర్రీకి బాగా నచ్చిందట. కానీ ఇంకా ఓకే అని మాత్రం చెప్పలేదట. సంక్రాంతి తర్వాత తన నిర్ణయం చెబుతానన్నాడట. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రం ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది.

Ram Charan liked Merlapaka Gandhi script

‘ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రం సంక్రాంతికి హిట్టయితేనే రామ్ చరణ్ ఓకే చెప్పే అవకాశం ఉంది. అంతా అనుకున్న ప్రకారం జరిగితే సినిమాను యూవి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతోందని అంటున్నారు. యూవి క్రియేషన్స్ సంస్థ కూడా రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

‘మిర్చి' తర్వాత యూవి క్రియేషన్స్ సంస్థ పెద్ద సినిమాలు ఏవీ చేయలేదు. మళ్లీ ప్రభాస్ తో సినిమా చేయడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. ఈ లోగా ఓ పెద్ద స్టార్ తో పెద్ద సినిమాను తీయాలని సంస్థ యోచిస్తోంది. రామ్ చరణ్ తో ప్రాజెక్టు ఓకే అయితే భారీగా నిర్మించేందుకు సిద్దంగా ఉందట.

English summary
Ram Charan recently heard a line narrated by director Merlapaka Gandhi. Charan liked it but is yet to give a nod to it. Charan is waiting for the result of Gandhi’s upcoming release Express Raja.
Please Wait while comments are loading...