twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నాయక్‌' విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిక

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'నాయక్‌' . సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా లంబాడాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే, కించపరిచే విధంగా ఉంటే చిత్ర విడుదలను అడ్డుకుంటామని లంబాడా హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. ఈ నెల 6న వరంగల్‌ బహిరంగ సభలో ఈ విషయమై ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొంది.

    గురువారం హైదర్‌గూడలోని పీఎంఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లయ్యనాయక్‌, రుక్మిణిబాయి, హన్మంతునాయక్‌, హూన్‌సింగ్‌నాయక్‌, జానూనాయక్‌, మంగీలాల్‌నాయక్‌ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ చిత్ర విడుదలకు ముందు లంబడా సంఘాల ప్రతినిధుల కోసం దీన్ని ప్రదర్శించాలని కోరారు. లంబాడాలను కించపరిచే, అవమానపరిచే, వక్రీకరించే విధంగా నాయక్‌ సినిమా చిత్రీకరణ ఉంటే ఓయూ విద్యార్థి, తెలంగాణ ఐకాసలతో కలిసి లంబాడా విద్యార్థులు చిత్రప్రదర్శనను అడ్డుకుంటారని హెచ్చరించారు.

    . ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ ''కథకి అనుగుణంగానే నాయక్‌ అనే పేరు ఖరారు చేశాం. రామ్‌చరణ్‌ పాత్ర తీరుతెన్నులు ఆయన నటించిన గత చిత్రాలకంటే భిన్నంగా ఉంటాయి..ఇది యాక్షన్ ఎంటర్టైనర్. అటు మాస్‌నీ ఇటు యువతనీ ఆకట్టుకొనే కథ ఇది ''అన్నారు

    నిర్మాత డి.వివి దానయ్య మాట్లాడుతూ...'ఈ కథకు 'నాయక్' అనే టైటిల్ సరిగ్గా యాప్ట్. పక్కా మాస్ అంశాలతో పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటే అద్భుతమైన కథను ఆకుల శివ అందించారు. ఈ సినిమాకు సంభాషణలు కూడా శివే అందించడం విశేషం. తమన్ సంగీతం, చోటా కె.నాయుడు ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. అన్నారు.

    అలాగే 'మగధీర' తర్వాత రామ్‌చరణ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. అమలాపాల్ పాత్ర కూడా కథలో కీలకమైందే. రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నులు ఇందులో వైవిధ్యంగా ఉంటాయి. ఇప్పటివరకూ కనపించని కొత్త చరణ్ మా సినిమాలో కనిపిస్తాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని తెలిపారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌.

    English summary
    Girijan students are demanding to change the title ‘Nayak’ because it is reserved for use exclusively by people belonging to tribal group.So, now they are demanding to change the movie title.But, the filmmakers are not yet taken any decision about the change of movie title. Kajal and Amala Paul are the heroines in the film.Nayak is directed by VV Vinayak and DVV Danayya is the producer.SS Thaman has composed the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X