»   » పవన్ ‘పంజా’తో పోలిక: రామ్ చరణ్ న్యూలుక్

పవన్ ‘పంజా’తో పోలిక: రామ్ చరణ్ న్యూలుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ మూవీ 'జంజీర్' వచ్చే నెలలో విడుదలకు సిద్దంగా ఉండటంతో ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రచారం కల్పించే పనిలో ఉన్నాడు చరణ్. ఇందులో భాగంగా హిందీ బుల్లితెరపై బాగా పాపులర్ అయిన డాన్స్ షో 'ఝలక్ దిఖ్లా జా 6' రియాల్టీ షోలో రామ్ చరణ్, ప్రియాంక పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ గడ్డంతో న్యూలుక్‌తో దర్శనం ఇచ్చాడు. చరణ్ లుక్ పంజా చిత్రంలో పవన్ కళ్యాణ్‌ను ఉందని అంటున్నారు. ఈ కొత్త లుక్‌లో చరణ్ చాలా బాగున్నాడని అంటున్నారు. మరి రామ్ చరణ్ పెంచుతున్న ఈ గడ్డం ఏ సినిమా కోసమో? అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

సెప్టెంబర్ 6న జంజీర్/తుఫాన్ విడుదలవుతోంది. రామ్ చరణ్ నటించని తొలి బాలీవుడ్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.

అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతోంది. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరో సినిమా కూడా విడుదల కానన్ని లొకేషన్లలో జంజీర్/తుఫాన్ విడుదలవుతోంది. 'బ్లూస్కై సినిమాస్' సంస్థ ఈచిత్రాన్ని అమెరికాలో విడుదల చేస్తోంది. వారు చెప్పిన వివరాల ప్రకారం మొత్తం 170 లొకేషన్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. న్యూయార్క్ మరియు న్యూజెర్సీ మెట్రో ఏరియాలోనే రికార్డు స్థాయిలో 17 స్క్రీన్లలో సినిమాను విడుదల చేస్తున్నారు.

రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

English summary
Ram Charan new look at 'Zanjeer' promotions. The last phase promotions of 'Zanjeer' kickstarted with the lead cast Ram Charan and Priyanka Chopra participating in the most popular dance reality show 'Jhalak Dikhla Jaa 6' on which glamour diva Madhuri Dixit judges the participants.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu