»   » ఎంఎస్.ధోనీ మూవీలో తన పాత్రపై.... రామ్ చరణ్ స్పందన!

ఎంఎస్.ధోనీ మూవీలో తన పాత్రపై.... రామ్ చరణ్ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ టీమిండియా క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ జీవితంపై సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. 'ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' టైటిల్ తో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాని, ధోనీకి అత్యంత సన్నిహితుడైన సురేష్ రైనా పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారని రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

జాతీయ మీడియాకు సంబంధించిన వెబ్ పోర్టళ్లతో పాటు.... తెలుగులో లీడింగ్ న్యూస్ పేపర్లకు సంబంధించిన వెబ్ సైట్లలో కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఉందని, కావాలనే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసారని ప్రచారం జరిగింది.

రామ్ చరణ్ స్పందన

రామ్ చరణ్ స్పందన

ధోనీ సినిమాలో తన పాత్ర ఉందని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలవ్వడంతో రామ్ చరణ్ స్పందించారు. ధోని సినిమాలో తన పాత్ర ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రామ్ చరణ్ స్పష్టం చేసారు.

తనను ఎవరూ సంప్రదించలేదు

తనను ఎవరూ సంప్రదించలేదు

ధోనీ సినిమాలో నటించాలని తనను ఎవరూ సంప్రదించలేదుని, అలాంటపుడు ఇలాంటి వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కావడం లేదని రామ్ చరణ్ విస్మయం వ్యక్తం చేసారు. రామ్ చరణ్ క్లారిటీ ఇవ్వడంతో ధోనీ సినిమా విషయంలో మెగా అభిమానుల్లో నెలకొన్న అయోమయానికి తెరపడినట్లయింది.

ధృవ మూవీ

ధృవ మూవీ

ప్రస్తుతం రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘దృవ' సినిమా చేస్తున్నారు. తమిళంలో హిట్టయిన థానీ ఒరువన్ చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది.

నిర్మాతగా కూడా

నిర్మాతగా కూడా

హీరోగా అటు సినిమా చేస్తుండటంతో పాటు తన తండ్రి చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నెం.150 సినిమాకు నిర్మాతకు కూడా వ్యవహరిస్తున్నారు రామ్ చరణ్. రెండు బాధ్యతలను హ్యాండిల్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు రామ్ చరణ్.

ధృవ ఎప్పుడు?

ధృవ ఎప్పుడు?

ధృవ సినిమాను వాస్తవానికి అక్టోబర్లో మొదటి వారంలో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అనుకున్న సమయానికి సినిమా పూర్తికాక పోవడంతో రిలీజ్ వాయిదా పడింది. నవంబర్ లేదా డిసెంబర్లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

English summary
Ram Charan not played Suresh Raina Role in MS Dhoni Untold Story, It is a false news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu