»   » మరో లీక్: రామ్ చరణ్ లుక్ ఊరమాస్ (ఫోటోస్)

మరో లీక్: రామ్ చరణ్ లుక్ ఊరమాస్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ ను గతంలో ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ మాస్ లుక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. లుంగీ, బనియన్ లో భారీ గడ్డంతో రామ్ చరణ్ భిన్నమైన లుక్ చూసి చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఫోటో లీక్ అయింది. ఈ ఫోటో చూస్తుంటే ఇందులో రామ్ చరణ్ చేసేది మామూలు మాస్ క్యారెక్టర్ కాదు.... ఊరమాస్ క్యారెక్టర్ అని స్పష్టమవుతోంది.

లీకైన ఫోటో ఇదే

లీకైన ఫోటో ఇదే

తాజాగా సోషల్ మీడియాలో లీకైన ఫోటో ఇదే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విలేజ్ కుర్రాడిగా రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.

ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని రోల్

ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని రోల్

రామ్ చరణ్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని ఓ భిన్నమైన క్యారెక్టర్ ఇది. ఇందులో రామ్ చరణ్ మాటతీరుగానీ, బాడీ లాంగ్వేజ్ గానీ చాలా భిన్నంగా ఉంటుందని, అభిమానులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

స్టోరీపై రకరకాల ప్రచారం

స్టోరీపై రకరకాల ప్రచారం

ఈ సినిమా స్టోరీపై రకరకాల ప్రచారం ఉంది. హీరో పల్లెటూరి అబ్బాయి. అతడు చెవిటివాడు. అమాయకుడైన పల్లెటూరి యువకుడు పట్నంలో అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడ ప్రయోగశాలతో చేరిన అతడిపై ఓ ప్రయోగం జరుగుతుందట. ఆ తర్వాత హీరో జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే స్టోరీ అంటూ ఓ రూమర్ ఉంది.

చెవిటి, మూగ?

చెవిటి, మూగ?

80ల నాటి పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని...., హీరోకు చెవుడు, హీరోయిన్ మూగ అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

మైత్రి మూవీ మేకర్స్

మైత్రి మూవీ మేకర్స్

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Mega Power Star Ram Charan pic leaked from Sukumar's movie. The pics are going viral in the social media. The film unit is busy with the shoot in the surrounding villages of Rajahmundry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu