»   »  బాలుడి ప్రాణాలు కాపాడిన రామ్ చరణ్, ఏం జరిగిందంటే...

బాలుడి ప్రాణాలు కాపాడిన రామ్ చరణ్, ఏం జరిగిందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఓ మంచి పని ఇపుడు మెగా ఫ్యాన్స్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. బాలుడి ప్రాణాలు కాపాడిన చరణ్ ఓ పేద కుటుంబంలో సంతోషాన్ని నింపాడు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే విషయంలో తండ్రికి తగిన తనయుడిని అని నిరూపించుకున్నాడు.

చెర్రీ చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకుంటాం అంటూ ఆ కుటుంబం తాజాగా 'రంగంస్థలం 1985' సెట్స్‌ను సందర్శించి రామ్ చరణ్ కు థాంక్స్ చెప్పారు. ఇంతకీ చెర్రీ చేసిన మేలేంటి? అసలు ఏం జరిగింది అనేది ఓ సారి పరిశీలిద్దాం...


బాలుడి పేరు ధనుష్

బాలుడి పేరు ధనుష్

రాజమహేంద్రవరం గ్రామానికి చెందిన ధనుష్‌ అనే మూడేళ్ల బాలుడు మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు. రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985' షూటింగ్‌ ఏప్రిల్ నెలలో రాజమహేంద్రవరం పరిసరాల్లో జరిగినపుడు ఈ విషయం రామ్ చరణ్ దృష్టికి వచ్చింది.


కరిగిపోయిన చరణ్

కరిగిపోయిన చరణ్

షూటింగ్ జరుగుతున్న సమయంలో ధనుష్‌ కుటుంబం రామ్‌ చరణ్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో కరిగిపోయిన రామ్ చరణ్ తన సొంత ఖర్చుతో చికిత్సకు ఏర్పాట్లు చేయించారు.


కరిగిపోయిన చరణ్

కరిగిపోయిన చరణ్

షూటింగ్ జరుగుతున్న సమయంలో ధనుష్‌ కుటుంబం రామ్‌ చరణ్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో కరిగిపోయిన రామ్ చరణ్ తన సొంత ఖర్చుతో చికిత్సకు ఏర్పాట్లు చేయించారు.


పూర్తి ఆరోగ్యంగా ధనుష్

పూర్తి ఆరోగ్యంగా ధనుష్

రామ్ చరణ్ ఆదేశాలతో హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో ధనుష్‌కు చికిత్స జరిగింది. ఇపుడు ధనుష్ పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ‘రంగస్థలం 1985' షూటింగ్ మళ్లీ రాజమహేంద్రవరం పరిసరాల్లోనే జరుగుతుండటంతో ధనుష్ కుటుంబం చరణ్‌ను కలిసి... ఆయన చేసిన మేలుకు ధన్యవాదాలు తెలిపారు.


రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు, పర్సనల్ లైఫ్ విషయాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.English summary
Ram Charan, who is shooting for Rangasthalam in Rajahmundry, had a surprise guest on his film’s set, a three-year-old kid, Dhanush, who was suffering from a kidney-related ailment. Apparently, the family first met Charan when he was shooting in Rajahmundry in April. “Being his fans, the kid’s family went to meet him. That’s when the mother told the actor about her son’s problem. He responded immediately and asked his team to make arrangements to provide medical aid to the kid,” says a source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu