»   » దాసరి కామెంట్స్... రామ్ చరణ్ స్పందన ఇలా... (వీడియో)

దాసరి కామెంట్స్... రామ్ చరణ్ స్పందన ఇలా... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాను నటించిన ‘బ్రూస్ లీ' సినిమా ‘రుద్రమదేవి' సినిమాతో క్లాష్ కావడంలో తమ ఫాల్ట్ ఏమీ లేదని రామ్ చరణ్ మరోసారి స్పష్టం చేసారు. ప్రస్తుతం ‘బ్రూస్ లీ' ప్రమోషన్లలో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇటీవల ‘రుద్రమదేవి' ప్రెస్ మీట్ లో దాసరి నారాయణరావు చేసిన కామెంట్లపై స్పందించారు.

‘బ్రూస్ లీ సినిమా రిలీజ్ డేట్ చాలా రోజుల క్రితమే ఫైనలైజ్ చేసాం. అప్పటికి తమకు ‘రుద్రమదేవి' విడుదల గురించి చిన్న క్లూ కూడా లేదు. ఈ విషయం మాకు ముందుగా తెలిసి ఉంటే రిలీజ్ డేట్ మార్చుకునే వాళ్లం. ఇప్పటికే రిలీజ్ కు సంబంధించి అన్నీ సెట్ చేసాం. చాలా బిజినెస్ ఇందులో ఇన్ వాల్వ్ అయి ఉంటుంది. ఇపుడు మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి' అని అని రామ్ చరణ్ తెలిపారు.


ఇటీవల రుద్రమదేవి సక్సెస్ మీట్ లో దాసరి నారాయణ మాట్లాడుతూ బ్రూస్ లీ సినిమా మరో తేదీకి వాయిదా వేసుకుంటే బావుండేదని పరోక్షంగా సూచించిన సంగతి తెలిసింద. అంతటితో ఆగని దాసరి ఈ విషయంలో వివాదం చెలరేగేలా కామెంట్స్ చేసారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో కూల్ గా సమాధానం ఇచ్చాడు.


ఎన్టీవీ సౌజన్యంతో

దాసరి వ్యాఖ్యలకు రామ్ చరణ్ ఎలా సమాధానం ఇచ్చారో ఇక్కడ చూడొచ్చు.


ఐడల్‌‌బ్రేన్ సౌజన్యంతో...

గతంలో ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఇలా...


అల్లు అర్జున్

దాసరి కామెంట్స్ నేపథ్యంలో అల్లు ఇలా స్పందించారు.


నిఖిల్

నిఖిల్ కూడా మద్దతుగా నిలిచాడు. తప్పు గుణశేఖర్ దే అని స్పష్టం చేసాడు.


English summary
Ram Charan has reconfirmed that it is not their fault that the film is clashing with Rudramadevi. The actor was busy in promotions of his Friday release Bruce Lee and when he was asked to react on the comments of Dasari in one of the interviews, he explained the situation subtly.
Please Wait while comments are loading...