»   » ఆ రోజు పవన్ బాబాయ్ తో మాట్లాడాకే.. : సీక్రెట్ బయిటపెట్టిన రామ్ చరణ్

ఆ రోజు పవన్ బాబాయ్ తో మాట్లాడాకే.. : సీక్రెట్ బయిటపెట్టిన రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నా కెరీర్ కు బాబాయ్ పవన్ కళ్యాణే ఇనిస్పిరేషన్ అంటున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫెస్ట్ లో రాంచరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

''ఇరవై సంవత్సరాల వయసులో నేను కూడా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే... మా అమ్మ నన్ను ఒకరి దగ్గరికి పంపించి తలుపు వేసింది. ఆ వ్యక్తి నాతో గంటసేపు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నాకు లైఫ్ అంటే అర్థమైంది. కెరీర్ విలువ తెలిసింది. నా కెరీర్ కు ఆయనే ఇనిస్పిరేషన్. అయన మరెవరో కాదు బాబాయ్ పవన్ కళ్యాణ్....''

అలా తన కెరీర్ కు బాబాయ్ పవన్ కళ్యాణే ఇనిస్పిరేషన్ అన్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫెస్ట్ లో రాంచరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంచరణ్ కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడారు.

తాను కాలేజ్ డేస్ లో ఎలా ఉండేవాడో వారితో షేర్ చేసుకున్నాడు. అంతే కాదు... ప్రేమ, కెరీర్, ఫ్యామిలీ గురించి ఎమోషనల్ గా మాట్లాడాడు. రాంచరణ్ స్పీచ్ విద్యార్థుల కేరింతలు విజిల్స్ మధ్య ఉల్లాసంగా సాగింది.

అర్ధం

అర్ధం

బాబాయ్ (వనన్) నాతో గంటసేపు మాట్లాడిన తర్వాత నా కెరీర్ కు అర్థం తెలిసోచ్చింది.

కష్టం

కష్టం

నాన్న ఎంత కష్టపడితే కానీ ఈ స్థాయికి చేరుకోలేదు...దానిని నేను దుర్వినియోగం చెయదలుచుకోలేదు.

స్థాయి

స్థాయి

నాన్న ఈ స్థాయికి ఎలా చేరుకున్నారో బాబాయ్ వివరంగా చెప్పారు. ఆ స్థాయిని, ఆయన కష్టాన్ని, విలువను, ప్రతిష్టను నిలబెట్టాలంటే ఎంత కష్టపడాలో వివరుంచారు.

వేస్ట్

వేస్ట్

ఆయన ఏర్పర్చిన ప్లాట్ ఫామ్ ని నిలబెట్టుకోలేకపోతే నేనైనా, నువ్వైనా వేస్ట్ అన్నారు పవన్ బాబయ్.

క్లారిటి

క్లారిటి

బాబయ్ తో మాట్లాడిన తర్వాత నేనేం చేయాలో నాకు క్లారిటీ వచ్చింది. నా గోల్ ఏంటనేది అర్థమైంది.

ఇనిస్పిరేషన్

ఇనిస్పిరేషన్

నా జీవితానికి అమ్మ,నాన్న ఎంత ఆదర్శమో, బాబాయ్ కూడా అంతే ఆదర్శం. బాబయ్ ఇనిస్పిరేషన్ నాకేరీర్ కూ బాగా కలిసోస్తుంది.

మీకు

మీకు

అభిమానులు మీకు, మీ కాలేజ్ లైఫ్ లో కూడా మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన వ్యక్తులు ఉంటారు. వారిని ఆదర్శంగా తీసుకోండి. మీ కెరీర్ ను ఉన్నతంగా మార్చుకోండి.

వయసులో

వయసులో

కాలేజ్ వయసులో అమ్మాయిలను చూడగానే అబ్బాయిలకు.... అబ్బాయిలను చూడగనే అమ్మాయిలకు ప్రేమించాలనిపిస్తుంది.

తప్పు

తప్పు

ప్రేమించడం తప్పు కాదు. మీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోండి.

వద్దు

వద్దు

మీరు 22 సంవత్సరాలకే పెళ్లి మాత్రం చేసుకోకండి. మీ కెరీర్ ఇబ్బందిలో పడుతుంది.

తర్వాతే

తర్వాతే

కెరీర్ బిల్డ్ చేసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి.

నో స్టేటస్

నో స్టేటస్

నేను ఉపాసన ప్రేమించుకున్నప్పుడు స్టేటస్ లు చూసి ప్రేమించుకోలేదు. స్టేటస్ లు చూసి ఎప్పుడూ ప్రేమించకూడదు.

 కేర్

కేర్

ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, లవ్, కెరీర్ విషయంలో కేర్ తీసుకోండి.

డెస్టినీని

డెస్టినీని

డెస్టినీని నమ్ముకోండి. నాకు ఉపాసనను ఇచ్చాడు. మీకు అలాంటి గొప్ప భార్య దొరుకుతుంది.

ప్రేమ

ప్రేమ

మా మధ్య అంత ప్రేమ ఉంది కాబట్టే మా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంది.

తగ్గదు

తగ్గదు

నాకు, ఉపసనాకు మధ్య ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఇది నిజం.

పాసులు

పాసులు

ఇప్పుడే బాబాయ్ కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ పాసులు ఇచ్చారు.

స్పెషల్

స్పెషల్

నేను మల్లారెడ్డి గారికి స్పెషల్ గా అందిస్తున్నాను. మీ పాసులు కూడా ఇందులోనే వున్నాయి.

స్టూడెంట్స్ తో

స్టూడెంట్స్ తో

చెర్రీ కాలేజ్ స్టూడెంట్స్ తో ఉద్వేగంగా మాట్డాడారు.

English summary
Actor Ram Charan Tej has attended as a chief guest for annual day celebrations of Malla Reddy Engineering and Technology at Maisammaguda in Medchal mandal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu