గోదావరి పుష్కరాలకు రామ్ చరణ్ విమానాలు...
హైదరాబాద్: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. టర్భో మెగా ఎయిర్ లైన్స్ సంస్థ.... ‘ట్రు జెట్' బ్రాండ్ పేరుతో చార్టెడ్ ఫ్లైట్లను నడుపబోతోంది. ఈ సంస్థ డైరెక్టర్లలో రామ్ చరణ్ కూడా ఒకరు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అతడే.
తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం....ఈ విమాన సంస్థ గోదావరి పుష్కరాలకు విమాన సర్వీసులు నడపాలని యోచిస్తోంది. ఈ మేరకు పర్మిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానయాన శాఖ నుండి అనుమతులు రాగానే సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తిరుపతి, బెంగుళూరు, షిర్డిలకు ఈ విమాన సర్వీలు తొలుత నడపాలని ప్లాన్ చేస్తారు. అయితే గోదావరి పుష్కరాలకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ మేరకు అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని మిని ఏరోప్లేన్స్ కొనుగోలు చేసింది.
ఆ సంగతి పక్కన పెడితే...రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ చిత్రానికి బ్రూస్ లీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











