»   »  ‘బ్రూస్ లీ’ సెట్స్: రామ్ చరణ్ ఇరగదీస్తున్నాడు (ఫోటోస్)

‘బ్రూస్ లీ’ సెట్స్: రామ్ చరణ్ ఇరగదీస్తున్నాడు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ సెట్ స్టిల్స్ రచయిత గోపీ మోహన్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా విడుదల చేసారు. రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ ఇరగదీసాడని, సాంగు కోసం నారాయణరెడ్డి వేసిన సెట్ చాలా బావుందని గోపీ మోహన్ పేర్కొన్నారు.

నిర్మాతలు చెప్పేదాని ప్రకారం..."బ్రూస్ లీ ...ది ఫైటర్ చిత్రం అక్టబర్ 16న విడుదల అవుతుంది. అలాగే ఈ నెలాఖరున ఆడియోని విడుదల చేస్తారు !!" ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి తరహా పాత్ర అని రచయిత గోపీ మోహన్ చెప్తున్నారు. చిరంజీవి కూడా ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం.

రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ‘బ్రూస్ లీ'. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా క్లైమాక్స్ ని చిత్రీకరించినట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ కోసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు చెప్పుకుంటున్నారు. క్లైమాక్స్ కోసం తెలుగు సినిమాలో నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. దాంతో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

రామ్ చరణ్-వైట్ల

రామ్ చరణ్-వైట్ల


సినిమా సెట్లో రామ్ చరణ్ తో కలిసి దర్శకుడు శ్రీను వైట్ల.

డాన్స్

డాన్స్


ఫస్ట్ సాంగులో రామ్ చరణ్ డాన్స్ ఇరగదీసాడని రచయిత గోపీ మోహన్ అంటున్నారు.

రకుల్

రకుల్


ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌.

బ్రూస్ లీ

బ్రూస్ లీ


ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan‬'s ‎Bruce Lee‬ first song shooting pics released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu