Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
రిపబ్లిక్ డే వాయెలెన్స్: పార్లమెంట్ మార్చ్ వాయిదా: రైతు సంఘాలు
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చెర్రీ ‘ధృవ’టీజర్ రిలీజ్ రేపే, టీజర్ లో ఆ విషయం చెప్పాలని ఫిక్స్
హైదరాబాద్: రామ్‌చరణ్ హీరోగా గీతాఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'ధృవ'. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పతాక సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. మీడియా హడావుడితో కూడిన వాతావరణం మధ్య రామ్‌చరణ్, అరవింద్ స్వామితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
ఐపీయస్ ట్రైనింగ్ పూర్తికాక ముందే డ్యూటీ స్టార్ట్ చేసిన ఓ కుర్రాడు.... సీక్రెట్‌గా శత్రువుకి చుక్కలు చూపిస్తాడు. తనకు చెక్ పెడుతున్నది ఎవరో శత్రువుకి తెలియడంతో ఆ కుర్రాడితో మైండ్ గేమ్ ఆడాలనుకుంటాడు. అప్పుడు ట్రైనీ ఐపీయస్ ఏం చేశాడు? రివర్స్‌లో ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు? అనే కథతో తెరకెక్కుతోన్న సినిమా 'ధృవ'.
ఈ చిత్రంలో శత్రువే తన బలంగా భావించే ఓ యువ ఐపీయస్ అధికారి పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఆయన తెరపై కనిపించే విధానం, హావభావాలు కొత్తగా ఉంటాయని చిత్రయూనిట్ చెబుతోంది. విజయదశమి సందర్భంగా 'ధృవ' టీజర్‌ను విడుదల చేయనున్నట్లు రామ్‌చరణ్ వెల్లడించారు.
Here you go guys #Dhruva teaser on 11th #DhruvaTeaser #RamCharan #HuntBegins pic.twitter.com/jeXXhd8tAZ
— Geetha Arts (@GeethaArts) October 9, 2016
ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది.ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించడం కోసం కండలు పెంచారు. మీసకట్టు స్టైల్ మార్చారు. కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి పాటను చిత్రీకరిస్తున్నారు.
అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక,నిర్మాతలు కృషి చేస్తున్నారు. మరో ప్రక్క ముంబైకి చెందిన ఓ పీఆర్ ఏజన్సీ.. ధృవ కోసం స్పెషల్ గా వర్క్ చేస్తోంది. అందుకే గతంలో ఎప్పుడూ కనిపించని స్థాయిలో.. స్పాట్ నుంచి ఫోటోస్ వీడియోస్.. ఎయిర్ పోర్ట్ ఫోటోస్ బయటకొస్తున్నాయ్.
అన్ని జాగ్రత్తలతో సురేంద్ర రెడ్డి, అది చెప్పటానికే ఈ లుక్ వదిలారు
నిజానికి ఈ వారం ''ధృవ'' సినిమా రిలీజ్ అయిపోయి ప్రకంపనాలు సృష్టించే దిశగా అడుగులు వేయాలి. కాని అనివార్య కారణాల వలన సినిమాను డిసెంబర్ లోకి పోస్టుపోన్ చేశారు. అందుకే ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఏదో ఒక ట్రీట్ ఇచ్చేసి మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని చూస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఈ నేపధ్యంలో చిత్రం లెటెస్ట్ ఫొటోలతో పాటు మరిన్ని విశేషాలు ఇక్కడ చూద్దాం.

అభిరుచికి తగ్గ మార్పులు
తమిళంలో విజయవంతమైన 'తని ఒరువన్'కి రీమేక్‌గానే తెరకెక్కుతున్నప్పటికీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కథలో కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ మార్పులు తెలుగు ప్రేక్షకులుకు ఖచ్చితంగా నచ్చుతాయని టీమ్ ప్రగాఢ విశ్వాసంతో ఉంది.

శత్రువుంటే చాలు
పోరాటం చేసేటప్పుడు చేతిలో ఆయుధం ఉండాలనుకొంటారు. అదే బలమని నమ్ముతారు. కానీ ఓ యువ ఐపీయస్ అధికారి మాత్రం ఎదురుగా శత్రువుంటే చాలంటాడు. అన్నిటికంటే శత్రువే తన బలం అంటాడు. మరి అతడి పోరాటం ఎలా సాగిందో తెలియాలంటే 'ధృవ' చూడాల్సిందే అని చెప్తున్నారు.

విజిల్స్ పడేలా
రామ్ చరణ్ కు మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సురేంద్రరెడ్డి ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా అరవింద్ స్వామికి, రామ్ చరణ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు వచ్చేటప్పుడు విజిల్స్ పడేలా ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

నటుగానూ ఈ సారి
రామ్ చరణ్ సినీ రంగంలోకి వచ్చి తొమ్మిదేళ్లయింది. ఈ తొమ్మిదేళ్లలో తొమ్మిది సినిమాలు చేశాడు. పదో సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఐతే ఇన్నేళ్లలో రామ్ చరణ్ హిట్లు చూశాడు. బ్లాక్ బస్టర్లూ కొట్టాడు. ఐతే నటుడిగా మాత్రం అనుకున్న స్థాయిలో పేరు సంపాదించలేకపోయాడన్నది నిజం. అయితే ధృవతో ఆ కోరిక తీరబోతోందని అంటున్నారు. రామ్ చరణ్ నటన అద్బుతంగా ఉండబోతోందని వినికిడి.

అభిప్రాయం పూర్తిగా మారుతుంది
'తనీ ఒరువన్' సినిమాను రామ్ చరణ్ రీమేక్ చేస్తున్నాడన్నపుడు జనాలు అంతగా ఎగ్జైటవ్వలేదు. ఈ సినిమా ప్రి లుక్.. ఫస్ట్ లుక్ పోస్టర్లు చూశాక మాత్రం జనాల అభిప్రాయం కొంత వరకు మారింది. జనాల్లో ఆసక్తి రేకెత్తించేలా స్టైలిష్‌గా.. ఇంటెన్సిటీ ఉండేలా ఈ పోస్టర్లు డిజైన్ చేసింది 'ధృవ' టీమ్. ఇప్పుడిక ఆ ఆసక్తిని మరింత పెంచేలా టీజర్ టచ్ ఇవ్వాలని చూస్తోంది సురేందర్ రెడ్డి అండ్ టీమ్.

జనతాకు ధీటుగా
ఈ మధ్యకాలంలో తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్ అయిన సినిమా ఏదీ అంటే..‘జనతా గ్యారేజ్' పేరు ముందు చెప్పుకోవాలి. ఈ సినిమాకు సెట్టయిన కాంబినేషన్ అలాంటిది మరి. ఆ క్రేజ్‌కు తగ్గట్లే అన్ని ఏరియాల్లోనూ భారీగానే బిజినెస్ జరిగింది ఈ సినిమాకు. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధికంగా బిజినెస్ చేసిన సినిమా జనతా గ్యారేజే. ఐతే దీని తర్వాత ‘ధృవ' సైతం దీనికి దీటుగా బిజినెస్ ఆఫర్లు తెచ్చుకుంటుండటం విశేషం. నిజానికి రీమేక్ సినిమా కావడం.. రామ్ చరణ్ గత రెండు సినిమాలూ ఫ్లాపులే కావడంతో ధృవ మీద మొదట్లో అంత హైప్ లేదు. పాజిటివ్ బజ్ లేకపోయినా బిజినెస్ విషయంలో దుమ్ము రేపుతోంది.

50 దాటచ్చు
ఫస్ట్ లుక్ పోస్టర్లు వచ్చాక సినిమా మీద హైప్ పెరిగి.. బిజినెస్ ఆఫర్లు బాగానే వస్తున్నాయి. వైజాగ్ ఏరియాకు ‘ధృవ' హక్కుల్ని క్రాంతి మూవీస్ సంస్థ రూ.5.4 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ‘జనతా గ్యారేజ్'కు ఈ ఏరియా హక్కులు రూ.5.12 కోట్లే పలికాయి. ఉత్తరాంధ్రలో మెగా హీరోల సినిమాలన్నింటికీ మంచి రేట్లే పలుకుతాయన్న సంగతి తెలిసిందే. మరోవైపు సీడెడ్లోనూ (రాయలసీమ) ‘ధృవ' మంచి రేటు దక్కించుకుంది. ఈ సినిమా హక్కులు అక్కడ ‘జనతా గ్యారేజ్‌తో సమానంగా .9 కోట్లు పలకడం విశేషం. మొత్తంగా ‘ధృవ' థియేట్రికల్ బిజినెస్ రూ.50 కోట్లను దాటుతుందని అంచనా వేస్తున్నారు.

నవదీప్ దీ కీలకమే
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. పోలీస్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా నవదీప్ కీలకపాత్ర పోషిస్తుండగా...విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్నాడు.

ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్
ధృవ రిలీజ్ వాయిదా పడటంతో అనేక సందేహాలు, రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. మూవీ చాలా బాగా వచ్చిందని.. ఔట్ పుట్ పై అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అంటున్నారు. అయినా సరే గత రెండు సార్లు అక్టోబర్ నెల రామ్ చరణ్ కి అచ్చి రాలేదు. గోవిందుడు అందరివాడేలే.. బ్రూస్ లీ రిజల్ట్ లు తేడా రావడంతో.. ఆ నెల రావడం రిస్క్ అని డిస్ట్రిబ్యూటర్లందరూ అల్లు అరవింద్ పై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. దీంతో సెంటిమెంట్ కి తలొగ్గిన అల్లు అరవింద్..ఈ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశాడని ఫిలిం నగర్ ఇన్ సైడ్ టాక్.

నాన్ స్టాప్ షెడ్యూల్స్
జూన్ స్టార్టింగ్ లో ధృవ షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్ కాగా.. అక్కడి నుంచి నాన్ స్టాప్ గా పిక్చరైజ్ చేస్తూనే ఉన్నారు. వరుసగా షెడ్యూల్స్ ప్లాన్ చేయడం.. చకచకా చిత్రీకరణ జరిపేయడం అంతా రిలీజ్ టార్గెట్ ని అందుకోవడానికే.

స్పెషల్ టీజర్
ఈ దసరాకు ''ధృవ'' సినిమా టీజర్ వస్తోందని ఎప్పటినుండో టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా నిజంగానే దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక ప్రత్యేక టీజర్ ను రెడీ చేస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ డైలాగును ఉంచాలా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు కాని.. ఒకవేళ చరణ్ డైలాగ్ పెడితే మాత్రం ఆ డైలాగ్ వెంటనే ఈ మెగా హీరో డబ్బింగ్ చెప్పేలా ఏర్పాట్లు చేశారట. మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిళ కూడా ఇప్పటికే మాంచి స్టన్నింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకటి కంపోజ్ చేశాడని తెలుస్తోంది. అందుకే ఈ టీజర్ ను కన్ఫామ్ గా చరణ్ రిలీజ్ చేస్తాడనే టాక్ నడుస్తోంది మరి.

రెండు టీజర్స్ ...
ముందుగా అయితే.. రామ్ చరణ్ మూవీ ధృవ ఫస్ట్ టీజర్ వచ్చేస్తోంది. అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు ధృవ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు.. అఫీషియల్ గానే అనౌన్స్ చేశాడు చెర్రీ. మరోవైపు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ లాంఛ్ పై కూడా అధికారిక ప్రకటనే వచ్చింది. శాతకర్ణి టీజర్ ను విజయ దశమి రోజున ఉదయం గం. 10.15 ని. లకు విడుదల చేస్తానని.. దర్శకుడు క్రిష్ చెప్పేశాడు.

బ్రేక్ తప్పదేమో
ధృవ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే ఓ సినిమా చేయనున్నాడని ఇప్పటికే చెప్పేసుకున్నాం. వరుసబెట్టి సినిమాలు చేయడంలో చరణ్ అంత యాక్టివ్ గా ఉండడు. ఓ సినిమాకి ఇంకో సినిమాకి మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ధృవ తర్వాత కూడా ఓ బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

చెక్కుతూ కూర్చోవద్దు
అక్టోబర్ 7న రామ్ చరణ్ ధృవ థియేటర్ల లోకి రావాల్సి ఉండగా.. పోస్ట్ పోన్ అయి.. డిసెంబర్ 2 డేట్ కి లాక్ అయ్యారనే టాక్ ఉంది. అయితే.. సినిమా రిలీజ్ కి డిసెంబర్ వరకూ డేట్ ఇచ్చినా.. అక్టోబర్ చివరికల్లా మూవీ కంప్లీట్ అయిపోవాలని చెప్పాడట రామ్ చరణ్. ముందుగా అనుకున్న టైమ్ కంటే.. టైమ్ దొరికింది కదా అని.. చెక్కుతూ కూర్చూంటే మాత్రం ఊరుకునేది లేదని తేల్చేశాడట అని చెప్పుకుంటున్నారు.

ఆసక్తి, ధ్రిల్స్ ప్రాణం
ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ తో పాటలను షూట్ చేసేశారు. అలాగే అరవింద్ స్వామికి సంబంధించి కీలకమైన సన్నివేశాలు కూడా పూర్తయ్యాయ్. హైదరాబాద్ లో టాకీ పార్టును , కొన్ని యాక్షన్ సీన్స్ నీ తేసేసారు, ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ''రామ్‌చరణ్ నటననీ, ఆయన స్టైల్‌ని కొత్త తరహాలో ఆవిష్కరించే చిత్రమిది. ప్రతి సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. తన శత్రువులపై ఐపీయస్ అధికారి సాధించిన విజయం ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేసేలా ఉంటుంది. చరణ్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ఈ చిత్రం కోసం సన్నద్ధమై నటించార''ని చిత్రయూనిట్ చెప్తోంది. అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోదం, సంగీతం: హిప్ హాప్ తమిళ