»   » షాకింగ్: రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీకి శాటిలైట్ రైట్స్ అంతా?

షాకింగ్: రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీకి శాటిలైట్ రైట్స్ అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా చరణ్ కెరీర్లో 9వ సినిమా. ఈ సినిమాలో రామ్ చరణ్ స్టంట్ మ్యాన్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ‘మై నేమ్ ఈజ్ రాజు', ‘బ్రూస్ లీ' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

Ram Charan

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ప్రముఖ ఎంటర్టెన్మెంట్ తెలుగు ఛానల్ జీ తెలుగు వారు భారీ మొత్తానికి శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కెరీర్లో రికార్డు స్థాయిలో రూ. 13 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు శాటిల్ లైట్ రైట్స్‌తో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ కలిపి ఈ భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. మా టీవీ, జీ తెలుగు మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో భారీ మొత్తం చెల్లించి ఈ సినిమాను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాను దసర నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. రామ్ చరణ్ సిస్టర్ పాత్రలో కృతి కర్బంధ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Zee Telugu has acquired the Satellite Rights of Ram Charan-Srinu Vytla's entertainer for a whooping Rs 13 crore.
Please Wait while comments are loading...