For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరింది కదూ:రామ్ చరణ్ కొత్త లుక్(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : మెగా హీరో రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం సిద్దమవుతున్నారు. గోవిందుడు అందరి వాడేలే లుక్ కు భిన్నంగా కనిపించటానికి ఆయన తన శరీరాన్ని మలుచుకుంటున్నారు. ఆ విషయం మనకు స్పష్టంగా ఈ ఫొటోలో కనిపిస్తుంది. స్టార్ క్రికెట్ మ్యాచ్ కర్టన్ రైజర్ ఈవెంట్ కు హాజరైన రామ్ చరణ్ తన అభిమానులకు తన లుక్ ని ఈ విధంగా చూపించినట్లైంది. స్లిమ్ గా ట్రిమ్ గా డిఫెరెంట్ హెయిర్ స్టెయిల్ తో ఉన్నారాయన. చేసేది యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి అందుకు తగినట్లు గా ఇలా సిద్దమయినట్లు చెప్తున్నారు.

  నెక్ట్స్ చేయబోయే చిత్రం విషయానికి వస్తే...

  రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు శ్రీను వైట్ల. అందరూ శ్రీను వైట్లతో ప్రాజెక్టు ఉండదు...అనుకున్న సమయంలో శ్రీను వైట్ల స్క్రిప్టుని ఫైనలైజ్ చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథని అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. డి.వివి దానయ్య ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో సెట్స్ మీదకు ఈ ప్రాజెక్టు వెళ్లనున్నట్లు చెప్పుకుంటున్నారు.

  మరో ప్రక్క...

  కృష్ణవంశీ తో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే' తర్వాత రామ్ చరణ్ ఏ చిత్రమూ కూడా సైన్ చేయలేదు. శ్రీను వైట్లతో అనుకున్న చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు. కోన వెంకట్,గోపీ మోహన్ తయారు చేసిన స్క్రిప్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ డైరక్టర్ ని ఫైనలైజ్ చేయలేదు. గౌతమ్ మీనన్ తో చిత్రం అనుకున్నారు కానీ అది ఆయన అజిత్ చిత్రం పూర్తయ్యే దాకా ప్రారంభించరు. దాంతో ఇప్పుడు మరో కన్నడ రీమేక్ పై రామ్ చరణ్ కన్నేసినట్లు సమాచారం.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  Ram Charan's new Look!

  ‘గోవిందుడు అందరివాడేలే' తర్వాత ఇప్పటికే పలువురి దర్శకులతో కథాచర్చల్లో పాల్గొన్న చరణ్ దేనిపైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. గోవిందుడు కూడా అనుకున్న ఫలితం ఇవ్వకపోవటంతో ఓ రీమేక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. కన్నడంలో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన ‘బహద్దూర్' చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

  ధ్రువ్ సర్జా, రాధకా పండిట్ జంటగా నటించిన ఈ చిత్రానికి చేతన్‌కుమార్ దర్శకత్వం వహించారు. పక్కా మాస్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్‌ను సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను ఇటీవలే చూసిన రామ్‌చరణ్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. . ఈ సినిమాకు సంబంధించిన హక్కులకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

  ఈ చిత్రం కథేమిటంటే..

  ఓ పెద్ద బహుదూర్ వంశానికి చెందిన హీరో అశోక్(ధ్రువ సర్జా) చుట్టూ కథ తిరిగుతుంది. అతను మైసూర్ వచ్చి తన ఐడింటిటీ దాచిపెట్టి తనెవరో చెప్పకుండా తనకు తగ్గ అమ్మాయిని వెతుకుతూంటారు. అప్పుడు అతనికో అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె అంజలి(రాధికాపండిట్). ఆమె తన తండ్రికి మాట ఇచ్చి ఉంటుంది. చదువు పూర్తైన తర్వాత ఎవరిని చూపెడితే వారినే పెళ్లి చేసుకుంటానని. ఈ విషయం తెలియని అశోక్ ఆమెతో ప్రేమలో పడి..ఆమె వెనక పడి, అల్లరి చేసి, చివరికి ఆమె చేత ఓకే చేయించుకుంటాడు.

  ఈ లోగా ఆమెకు ఇంటి నుంచి కబురు వస్తుంది. ఇంటికి వెళ్లగానే తండ్రి ఆమెతో..నీకు నా ఆత్మీయ స్నేహితుడు అప్పాజీ కుమారుడు శంకర్ తో పెళ్లి నిశ్చయం చేసానని చెప్పి, ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేసేస్తాడు. తండ్రికి ఇచ్చిన మాట కాదనలేని అంజలి....ఇటు ఈ విషయం తెలుసుకున్న అశోక్ ఏం చేసారు. వారిద్దరి వివాహం ఎలా జరిగింది. ఈ కథలో అప్పాజీ గౌడ ఏం విలనీ చేసి, ఈ ప్రేమకుల మధ్య ఎడబాటు సృష్టించాడు వంటి ఆసక్తికరమైన అంశాలతో కథ నడుస్తుంది.

  English summary
  Ram Charan was the special attraction at the curtain raiser event of Star Cricket Match event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X