»   » రామ్ చరణ్ ‘ద్రువ’ మేకోవర్ సూపర్ (ఫోటోస్)

రామ్ చరణ్ ‘ద్రువ’ మేకోవర్ సూపర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో రామ్ చరణ్ సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారు.

పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రకు తగిన విధంగా రామ్ చరణ్ ఫిట్ గా తయారయ్యాడు. ఇందుకోసం కొన్ని నెలలుగా కేవలం శాఖాహారంతో కూడిన డైట్ తీసుకోవడంతో పాటు ఫిజికల్ ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా కొన్ని కసరత్తులు చేస్తున్నాడు. షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి రామ్ చరణ్ కేక పుట్టించే లుక్ లోకి మారిపోయాడు.

రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి రిలీజైంది. కేవలం లుక్ పరంగానే కాదు క్యారెక్టర్ పరంగా కూడా చరణ్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. విభిన్నమైన కథాంశంతో రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ నెల 22నుంచి హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ పార్ట్ చిత్రీకరించారు. హైదరాబాద్ షెడ్యూలర్ పూర్తయిన తర్వాత జూన్ నెల 20 నుంచి కాశ్మీర్ లో కీలకమైన షెడ్యూల్ ని ప్లాన్ చేశారు.

తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ అందచందాలు, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి.

రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్

రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్

రామ్ చరణ్ లేటెస్ట్ ఫోటో ఇది. అభిమానులు ఈ ఫోటో చూసి సూపర్బ్ అంటున్నారు.

కేవలం వెజిటేరియన్ ఫుడ్

కేవలం వెజిటేరియన్ ఫుడ్

కొన్ని రోజులుగా రామ్ చరణ్ కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ డైటింగ్ చేస్తున్నాడు.

అభిమానులతో..

అభిమానులతో..

సినిమాకు సంబంధించిన విషయాలను రామ్ చరణ్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

సినిమా పోస్టర్ నిజమేనా?

సినిమా పోస్టర్ నిజమేనా?

రామ్ చరణ్ ద్రువ సినిమాకు సంబంధించిన అనఫీషియల్ పోస్టర్ ఇది. కొన్ని రోజులుగా ఈ పోస్టర్ నెట్లో హల్ చల్ చేస్తోంది.

సినిమా వివరాలు

సినిమా వివరాలు

రామ్ చరణ్ ద్రువ సినిమాకు సంబంధించిన అనఫీషియల్ పోస్టర్ ఇది. కొన్ని రోజులుగా ఈ పోస్టర్ నెట్లో హల్ చల్ చేస్తోంది.

English summary
Ram Charan's new movie Druva look released. The movie directed by Surendar Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu