»   » వైజాగ్ రన్ : రామ్ చరణ్ రాకతో తొక్కిసలాట

వైజాగ్ రన్ : రామ్ చరణ్ రాకతో తొక్కిసలాట

Posted By:
Subscribe to Filmibeat Telugu

వైజాగ్ : వైజాగ్‌లో ఆదివారం విశాఖ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ తరుపున 'ఒలంపిక్ డే రన్' కార్యక్రమాన్నినిర్వహించారు. ఆదివారం ఉదయం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ నుంచి ఈ రన్ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో జనం పాల్గొనేలా చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించాలని నిర్వాహకులు ప్లాన్ చేసారు.

దాదాపు లక్షమంది పాల్గొడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణ తేవడంలో భాగంగా నిర్వహకులు సినిమా స్టార్ రామ్ చరణ్ తేజను కూడా ఆహ్వానించారు. రామ్ చరణ్ రాక విషయం తెలుసుకుని అక్కడికి వేలాది మంది అభిమానులు ఆయన్ను చూసేందుకు తరలి వచ్చారు.

రామ్ చరణ్ వేదికపైగా రాగానే జనం ఒక్కసారిగా ఆయన్ను చూసేందుకు దూసుకువచ్చారు. ఓ సందర్భంలో వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. చిన్న పాటి తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' షూటింగులో పాల్గొంటున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ మూవీ 'జంజీర్' త్వరలో తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.

English summary

 Ram Charan's presence caused stampede in Vizag. Vizag on Sunday morning saw hundreds of Vizagites making their way to the Andhra university Engineering Grounds to participate in the Olympic Day Run which was organized by the Vizag District Olympic Association (VDOA).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu