»   » రామ్ చరణ్‌ పాత్ర పేరు ఇదేనా?: అభిమన్యు నారాయణ - రంగస్థల కథానాయకుడు

రామ్ చరణ్‌ పాత్ర పేరు ఇదేనా?: అభిమన్యు నారాయణ - రంగస్థల కథానాయకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ పీరియాడిక్‌ లవ్‌స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ నవ్యతకు పెద్దపీట వేసే సుకుమార్‌ తన సినిమాకు 'రంగస్థలం 1985' అనే టైటిల్‌ ఖరారు చేశారు. విడుదలైన కొద్ది సేపటికే వరల్డ్‌వైడ్‌ ట్రెండ్‌లలో 45వ స్థానంలో నిలిచింది ఈ టైటిల్‌. ఇప్పుడు మాత్రం ఇందులో చరణ్‌ చేస్తున్న పాత్ర పేరు 'అభిమన్యు నారాయణ' అని టాక్‌.

రామ్ చరణ్ అండ్ సమంత

రామ్ చరణ్ అండ్ సమంత

సుకుమార్ డైరక్షన్లో.. రామ్ చరణ్ అండ్ సమంత, లీడ్లో.. మైత్రి మూవీస్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా పేరును ''రంగస్థలం 1985'' అని పెట్టేశారు. ఆల్రెడీ ఈ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని తెలుసు కాని.. అందరూ కూడా 1947 కంటే ముందు జరిగే సినిమా అనుకున్నారు.

1985లో జరిగే ఒక కథ

1985లో జరిగే ఒక కథ

కాని ఇది 1985లో జరిగే ఒక కథ అని టైటిల్ చూస్తే తెలుస్తుంది. ఇకపోతే సినిమాకు 'రంగస్థలం' అనే పెట్టారంటే.. ఇందులో ఏమన్నా హీరో నాటకాలలో పనిచేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడా? లేకపోతే నాటకం ఈ సినిమాలో కీలకమైన మలుపుగా ఉంటుందా ? ఎందుకు సుకుమార్ అలా పెట్టాడో ఇంకా తెలియదు.

స‌మంత ప‌ల్లెటూరి పిల్ల‌గా

స‌మంత ప‌ల్లెటూరి పిల్ల‌గా

ఇందులో రామ్ చ‌ర‌ణ్ చెవిటి వ్య‌క్తిగా క‌నిపించ‌నుండ‌గా, స‌మంత ప‌ల్లెటూరి పిల్ల‌గా సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇప్పుడు షూటింగ్ లొకేష‌న్ లో రామ్ చ‌ర‌ణ్ కి సంబంధించిన కొన్ని పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. లుంగీ క‌ట్టులో మాస్ లుక్ తో క‌నిపిస్తున్న చెర్రీని చూసి ఫ్యాన్స్ ఈ మూవీ ప‌క్కా వెరైటీ క‌థాంశంతో రూపొందుతుంద‌నే ఆలోచ‌న చేస్తున్నారు.

విలేజ్ బెల్లి

విలేజ్ బెల్లి

ఇక గ్లామ‌ర్ డాల్ స‌మంత త‌న ఇన్ స్ట్రాగ్రామ్ లో కేవ‌లం పాదాల‌తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ .. ఇలాంటి పాత్ర ఎప్పుడు పోషించ‌లేదు, విలేజ్ బెల్లి అంటూ కామెంట్ పెట్టింది.దీంతో అంచనాలు ఇంకా పెరిగాయి... గుబురు గడ్డం, గళ్ల లుంగీతో ఇప్పటికే ఈ చిత్రంలో చరణ్‌ గెటప్‌ చాలామందిని ఆకట్టుకుంది. ఇలా కాకుండా వేరే గెటప్‌లోనూ కనిపిస్తారా? అని చెప్పడానికి ఇంకాస్త టైమ్‌ పడుతుంది.

రంగస్థలం 1985

రంగస్థలం 1985

రంగస్థలం 1985 అని పెట్టినప్పటి నుండి ఆ సినిమా కథ పై రకరకాల మాటలు అనుకుంటున్నారు కథ గురించి. రంగస్థలం (ఇంగ్లీషులో స్టేజ్) అనే పదం అప్పటిలో నాటకాలు వేసే వారు వాడేవాళ్లు కాబట్టి ఈ సినిమాలో చరణ్ ఒక వీది నాటకులు వేసే కుర్రాడుగా కనిపిస్తాడు అని ఒక ఊహ ఉంది.

రంగస్థలం అనే పదం కథలో ఒక భాగం

రంగస్థలం అనే పదం కథలో ఒక భాగం

అయితే ఈ సినిమాకు పనిచేసే వాళ్ళు చెప్పినదాని ప్రకారం ఇది ఒక ఊరి లో జరిగే ప్రేమ కథ అని ఈ సినిమాలో రంగస్థలం అనే పదం కథలో ఒక భాగం కాబట్టి రంగస్థలం అనే శబ్దం సినిమా కథ గురించి పుస్తకాలలో ముందు ఉండే ముందుమాటలా ఉంటుందని అలా పెట్టారట.

అభిమన్యు నారాయణ

అభిమన్యు నారాయణ

ఇప్పుడు మాత్రం ఇందులో చరణ్‌ చేస్తున్న పాత్ర పేరు ‘అభిమన్యు నారాయణ' అని టాక్‌. ‘అభిమన్యు నారాయణ'.. రంగస్థల కథానాయకుడు అనే బోర్డ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చరణ్‌ రంగస్థల నటుడి పాత్ర చేస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి.

పాత్ర పేరే అయ్యుంటుందా?

పాత్ర పేరే అయ్యుంటుందా?

సో.. అభిమన్యు అనేది చరణ్‌ పాత్ర పేరే అయ్యుంటుందా? లేక వేరే పాత్ర పేరా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సమంత కథానాయికగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎర్నెని నవీన్, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు .

English summary
Finally, it's now buzzed that Ram Charan would be seen as an actor of Rangasthalam (stage artist) in the film. Also, his name is rumoured to be Abhimanyu Narayana in the movie. Yet, there is no clarity from the makers on the leaked news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu