»   » రామ్ చరణ్ విమానం ఇదే.... (ఫోటో)

రామ్ చరణ్ విమానం ఇదే.... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. టర్భో మెగా ఎయిర్ లైన్స్ సంస్థ.... ‘ట్రు జెట్' బ్రాండ్ పేరుతో చార్టెడ్ ఫ్లైట్లను నడుపబోతోంది. ఈ సంస్థ డైరెక్టర్లలో రామ్ చరణ్ కూడా ఒకరు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అతడే.

ట్రూ జెట్' తొలి విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. ఏటీఆర్ 72-500 విమానం శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుందని, రెండో విమానం మరో వారం రోజుల్లో చేరుకుంటుందని టర్బో మెఘా ఎయిర్‌వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. జూన్ చివరి వారంలో విమాన సర్వీసులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. తొలుత తిరుపతి, ఔరంగాబాద్, రాజమండ్రిలకు సర్వీసులను నడపనున్నారు.

Ram Charan TruJet

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే..
మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ముంబై ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఆయన తన తర్వాతి సినిమా షూటింగు కోసం యూరఫ్ వెలుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మార్చి 16న ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత డివివి దానయ్య ‘డివివి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారుకాలేదు. ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు."నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu