»   » ఈ బాబును వెతికి పెట్టాలంటూ రామ్ చరణ్ విన్నపం

ఈ బాబును వెతికి పెట్టాలంటూ రామ్ చరణ్ విన్నపం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో ఓ వీడియో షేర్ చేసాడు. ఇందులో ఓ చిన్న పిల్లాడు మగధీర డైలాగును వీరలెవల్లో చెప్పడం రామ్ చరణ్ కు తెగ నచ్చింది. పిల్లాడి టాలెంటుకు తాను ముగ్దుడినైపోయానని, అతన్ని కలవాలనుకుంటున్నాను. కానీ అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అతన్ని వెతకడంలో నాకు హెల్ప్ చేయడండి అని కోరాడు. మరి ఆ పిల్లాడు ఎక్కడైనా కనినిస్తే వెతికి పట్టుకోండి.

Post by Ram Charan.

రామ్ చరణ్ సినిమాల విషయానికిస్తే...
రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. డివివి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు. ఈ రోజు (మార్చి 5) ఉదయం 6 గంటల 24 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో వైభవంగా ప్రారంభమైంది.

Ram Charan searching for kid

మెగాస్టార్ చిరంజీవి దంపతులు, దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేవుని ఫోటోలపై మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ గారు క్లాప్ ఇవ్వడం జరిగింది. చిత్రం స్రిప్ట్ ను మెగాస్టార్ చిరంజీవి గారు దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత దానయ్య డి.వి.వి.లకు అందజేశారు . దర్శకుడు వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ "ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. . కథ చాలా బాగా వచ్చింది. రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లతో నా కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. మళ్ళీ మా కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందటం ఎంతో ఆనందాన్నిస్తోంది. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎంతో అంకితభావంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

English summary
Ram Charan searching for facebook kid, who delivered dialogue from Magadheera movie. 'I see video almost every day ,I love this talented kid and I want to meet him. So friends ,help me find this kid" Ram Charan said.
Please Wait while comments are loading...