»   » ఇది రామ్ చరణ్ సెల్ఫీ (ఫొటో)

ఇది రామ్ చరణ్ సెల్ఫీ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా మెల్లిగా సెల్ఫీల పిచ్చి మొదలైంది. ఈ సారి రామ్ చరణ్ ఓ సెల్ఫీ తీసుకుని వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణతో కలిసి తన వ్యానిటీ వ్యాన్ లో ఈ సెల్ఫీ తీసుకున్నారు. రామ్ చరణ్ తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలా చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేస్తున్నారు. దాంతో అక్కడ లొకేషన్స్ కు వచ్చిన గోపాల కృష్ణ గారితో రామ్ చరణ్ ఇలా సెల్ఫీ ముచ్చట తీర్చుకున్నాడు.

దర్శకుడు కృష్ణవంశీ, రామ్‌చరణ్ తొలి కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న బండ్ల గణేశ్ ఈ చిత్రానికి నిర్మాత. కాజల్ హీరోయిన్. ఈ సినిమా మీద మెగాభిమానుల ఆశలు హైరేంజ్‌లోనే ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక విజయవంతమైన చిత్రాన్ని వారికి అందించాలనే తపనతో కృషి చేస్తున్నారు కృష్ణవంశీ. రామ్‌చరణ్‌కి ఇది ఎనిమిదో చిత్రం. అయితే ఇంతవరకూ ఆయన నటించిన ఏ సినిమా కూడా విజయదశమికి విడుదల కాలేదు. అందుకే తొలిసారిగా దసరా సందర్భంగా అక్టోబర్ ఒకటిన ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత గణేశ్ సన్నాహాలు చేస్తున్నారు.

Ram Charan selfie moment!

మరో ప్రక్క ఈ సినిమా రైట్స్ కోసం మాత్రం భారీ కాంపిటీషన్ నడుస్తోంది. నెల్లూరు రైట్స్ కోసం జరిగిన పోటీలో హరి పిక్చర్స్ వారు ఆల్ టైం రికార్డ్ ప్రైస్ కి 'గోవిందుడు అందరివాడెలే' రైట్స్ ని సొంతం చేసుకున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా వుంటుంది.

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న 'గోవిందుడు అందరివాడెలే' సినిమాలో మొత్తం 5 పాటలుంటాయి. అందులో ఇప్పటికే 2 పాటలను షూట్ చేసారు. రామ్ చరణ్ ఎన్నారైగా కనిపించనున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. కృష్ణవంశీ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.

English summary
Ram Charan to pose with legendary writer Paruchuri Gopalakrishna. The picture was shot in the vanity van of the actor on the sets of 'Govindudu Andari Vaadele'. Writer-Duo has been working for this family entertainer directed by Krishna Vamsi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu