twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రచ్చ'లో తన పాత్ర గురించి రామ్ చరణ్

    By Srikanya
    |

    సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న తాజా చిత్రం 'రచ్చ'. ఈ చిత్రంలో తన పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు రామ్ చరణ్. ఆయన మాట్లాడుతూ...చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాదుగానీ... రచ్చ రచ్చ చేస్తేగానీ వూరుకోడు. తెల్ల జెండా వూపి శాంతి శాంతి అంటూ గొడవ సద్దుమణిగించుకొందామన్నా వూరుకోడు. అటోఇటో తేలిపోవల్సిందే అంటాడు. ధైర్యంగా దూసుకుపోతూ... సై అంటే సై అనే ఆ యువకుడి లక్ష్యం ఏమిటో తెర మీదే చూడాలి అన్నారు రామ్‌చరణ్‌. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌ జైన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో హీరో,హీరోయిన్స్ పై, ఇతర తారాగణంపై కీ సీన్స్ షూట్ చేస్తున్నారు.ఇక చిత్ర సమర్పకులు ఆర్‌.బి.చౌదరి మాట్లాడుతూ ''మాస్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది.

    రామ్‌చరణ్‌ హావభావాలు, పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. శ్రీలంక, చైనాల్లో చిత్రించిన పోరాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. 'రచ్చ' కోసం చిరంజీవి గ్యాంగ్‌లీడర్‌ సినిమాలోని వానా వానా వెల్లువాయె పాటను రీమిక్స్‌ చేశారు. ఇక ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. అడ్డొస్తే... ఇక రచ్చ రచ్చే. ఇలాంటి మనస్తత్వం ఉన్న కుర్రాడే కధ రచ్చ. అతను సృష్టించిన హంగామా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగండి అంటున్నారు దర్శకుడు. ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.

    English summary
    Ram Charan Teja spoke about his character in Rachcha, while the shooting is taking at Ramoji Film City.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X