twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్‌పై అసూయపడ్డా, ప్రతి రోజూ భయం... బాబాయ్ మాట గుండెలోకి దూసుకెళ్లింది: రామ్ చరణ్

    |

    వరుణ్‌ తేజ్‌, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అంతరిక్షం 9000'. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై క్రిష్‌ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. డిసెంబర్‌ 21న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ తొలి టికెట్ కొనుగోలు చేసి ఆసక్తికరంగా ప్రసంగించారు.

    వరుణ్ పిలిచాడని కాదు...

    వరుణ్ పిలిచాడని కాదు...

    సంవత్సరానికి ఒక సినిమా చేస్తే గొప్ప. రెండు సినిమాలు చేస్తే అదొక అదృష్టం. మా అందరికీ రెండు సినిమాలు చేయాలనే కోరిక ఉంటుంది. కానీ రెండు సార్లు మీ(అభిమానులు) ముందుకు రావడం సినిమా కన్నా ఎక్కవ ఆనందాన్ని ఇస్తుంది. మీ ముందుకు వచ్చి చాలా రోజులైంది. వరుణ్ పిలవగానే వద్దని చెప్పకుండా వచ్చాను. ఇది కేవలం వరుణ్‌ మీద ఉన్న ప్రేమకన్నా ట్రైలర్‌ చూసిన తర్వాత ఏర్పడిన అభిమానం, గౌరవం. ఇంత మంచి ట్రైలర్‌ ఈ మధ్యకాలంలో చూడలేదు. ఔట్ స్టాండింగ్‌గా ఉంది. ఒక విజనరీతో కూడుకున్న ట్రైలర్, గ్రేట్‌ టీం చాలా ప్యాషనేట్‌గా తీసిన ఒక సినిమాలాగా అనిపించింది.

    మీరు చాలా డేరింగ్...

    మీరు చాలా డేరింగ్...


    ఇంత మంచి సినిమాను మాకు ఇస్తున్నందుకు టెక్నీషియన్లకు థాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా శేఖర్ గారు... నేను బాగా ఇష్టపడే డిఓపీ. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్క్ బావుంది. క్రిష్ కంచె సినిమాకు నేను వచ్చాను... ఆ సినిమాకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మళ్లీ రాజీవ్ గారు, క్రిష్ గారు తీస్తున్న సినిమాకు రావడం ఆనందంగా ఉంది. డేరింగ్ తెలుగు ప్రొడ్యూసర్లుగా మీరు ఇలాంటి సినిమా చేయడం గర్వంగా ఉంది. రంగస్థలం సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్స్, దంపతులు రామకృష్ణ, మోనికగారికి ఇంత మంచి సినిమా అందించినందుకు, ఇంత మంచి విజువల్స్ కు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. మిగతా టెక్నీషియన్స్‌ అందరికీ పేరు పేరున థాంక్స్‌.

    ఆయన కటౌట్ ఇంతే... కానీ విజన్ గొప్పగా ఉంది

    ఆయన కటౌట్ ఇంతే... కానీ విజన్ గొప్పగా ఉంది

    అన్నింటికంటే ముఖ్యంగా సంకల్ప్‌ గురించి చెప్పాలి. ఆయన కటౌట్‌కి, విజన్‌కి సంబంధం లేదు. నేనెప్పుడూ అంటాను మనిషి కన్నా గొప్పది మన ఆలోచన. అలాంటి ఒక గ్రేట్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటారు. అది సినిమా రంగం అయినా, పాలిటిక్స్ అయినా... ఆలోచన అనేది చాలా ముఖ్యం. అలాంటి గ్రేట్‌ ఆలోచనలున్న మన దర్శకుల్లో రాజమౌళిగారు అవ్వొచ్చు.. సుకుమార్‌గారు అవ్వొచ్చు, క్రిష్‌గారు అవ్వొచ్చు..రేపు వీళ్లందరికంటే గొప్ప స్థాయికి సంక్పల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    వరుణ్‌ను చూసి జలస్ ఫీలయ్యా

    వరుణ్‌ను చూసి జలస్ ఫీలయ్యా

    సంకల్ప్ గారికి సపోర్ట్ చేసిన లావణ్య, అదితి చాలా బాగా నటించారు. వరుణ్‌ ఎప్పుడూ మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేస్తూ వచ్చాడు. కొన్నిసార్లు వరుణ్‌ సినిమాలు చూసి ఆనందపడ్డాను. కొన్ని సినిమాలు చూసి అసూయ పడ్డాను. ఈ సినిమా చూసి తనపై జలస్ ఫీలయ్యాను. చాలా మంచి చిత్రం. చాలా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు మన దగ్గరకి రావు. నీ డేడికేషన్‌, నీ ఆలోచనా తీరే ఇలాంటి డిఫరెంట్‌ సినిమాలను నీ దగ్గరకు చేర్చుతున్నాయి. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఆలోచనలు ఉన్న ఒక మంచి వ్యక్తికి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడని నమ్ముతాను. వరుణ్ ఇలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. డిసెంబర్‌ 21న మన మెగాభిమానులు గర్వపడే సినిమా. రెగ్యులర్‌ ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేసే అవుతుందని కోరుకుంటున్నాను.

     బాబాయ్ చెప్పిన మాట గుండెల్లోకి దూసుకెళ్లింది

    బాబాయ్ చెప్పిన మాట గుండెల్లోకి దూసుకెళ్లింది

    నన్ను ఈ సినిమా ఫంక్షన్ కు పిలిచిన నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా స్పీచ్‌లు మనం చూశాం. చాలా పంక్షన్లు చూశాం. మనస్ఫూర్తిగా చెబుతున్నాను... మనకు నచ్చే నటులు కానీ, వ్యక్తులు చెప్పే మాటలు కొన్ని సార్లు చాతి విరిచి అరిచేలా ఉంటుంది. మీరు సభకు అటు వైపు ఉన్నారు కాబట్టి అరుస్తున్నారు. మేము ఇటువైపు ఉన్నాం కాబట్టి అరవడం లేదు. అంతే తేడా తప్ప రెండు గుండెల చప్పుడు ఒకటే. మొన్నే బాబాయ్ చెప్పిన మాటలు చాలా గట్టి నా గుండెల్లోకి దూసుకెళ్లిపోయాయి. ప్రతిరోజూ మనం భయపడే ఒక పని, భయానికి మన ఆలోచనల్ని ఆపేసే ఒక పని.. ప్రతి రోజు అలాంటి పని చేసి ఒక విజయం సాధించాలని బాబాయ్ చెప్పిన మాట చాలా చాలా గట్టిగా అనిపించింది. ఇది ఆయన చెప్పాడని కాదు... అందులోని భావాన్ని మీరు గ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. అని రామ్ చరణ్ అన్నారు.

    English summary
    Ram Charan Speech at Antariksham Pre Release Event. Antariksham 9000 KMPH Movie Pre Release Event held at Hyderabad. Ram Charan, Varun Tej, Lavanya Tripathi, Aditi Rao Hydari, Satya Dev, Raja, Sankalp Reddy, Prashanth R. Vihari, Krish, Ananta Sriram, Sirivennela Seetharama Sastry, Ramakrishna, Suma at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X