»   » ఈ రోజు నుంచే: రామ్ చరణ్ యూరప్‌లో రచ్చ

ఈ రోజు నుంచే: రామ్ చరణ్ యూరప్‌లో రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రామ్‌చరణ్‌ హీరోగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. బుధవారం నుంచి యూరప్‌లో పాటల్ని తెరకెక్కిస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు 

దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ....'' ఎంటర్టైన్మెంట్ తో సాగే కుటుంబ కథాచిత్రమిది. రామ్‌చరణ్‌ సినిమా అంటే అభిమానులు ఏమేం ఆశిస్తారో తెలుసు. అవన్నీ ఈ చిత్రంలో మేళవించాం. అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మీ అందరినీ ఆకట్టుకొనే మంచి చిత్రమవుతుంద''అని అన్నారు.

Ram Charan, Sreenu Vaitla movie unit heads to Europe

నిర్మాత మాట్లాడుతూ ''ఈ నెల 30 వరకూ యూరప్‌లో పాటల్ని చిత్రీకరిస్తాం. జూన్‌ 3 నుంచి తిరిగి హైదరాబాద్‌లో షూటింగ్‌ మొదలెడతాం. అక్టోబరు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

అలాగే... ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా నటించబోతున్నాడు. పాత్రలో రియాల్టీ కోసం థాయ్ లాండ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని జైకా స్టంట్ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు చరణ్. థాయ్‌లాండ్ లోని ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లలో ఇదీ ఒకటి. క్రితి కర్బంధ ఈ చిత్రంలో రామ్ చరణ్ చెల్లెలు పాత్రలో నటిస్తోందట. సినిమా ప్రధానం ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుందట.

బ్రహ్మానందం, నదియా, కృతి కర్బంద, తనికెళ్లభరణి, ముఖేష్‌రుషి, రావురమేష్‌, షాయాజీ షిండే, పోసాని, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. కథ: కోన వెంకట్‌, గోపిమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, లైన్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వి.వై.ప్రవీణ్‌కుమార్‌, సమర్పణ: డి.పార్వతి

English summary
Ram Charan and Rakul Preet are Europe bound for the shooting of their forthcoming film. Charan, Rakul will be shaking their legs in Europe as director Srinu Vaitla planned to shoot songs on the duo between May 20 th to May 30 in the picturesque locales
Please Wait while comments are loading...