»   » హైదరాబాద్ పాత బస్తీలో రామ్ చరణ్ గొడవ!

హైదరాబాద్ పాత బస్తీలో రామ్ చరణ్ గొడవ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పెయిల్, ఇటలీల్లో జరిగింది. రెండు పాటలు చిత్రీకరించారు. తిరిగి చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. బుధవారం ఉదయం నుండి హైదరాబాద్ పాతబస్తీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రౌడీలతో గొడవపడే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి ఇంకా అఫీషియల్ టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత డివివి దానయ్య ‘డివివి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Ram Charan-Srinu Vaitla movie shooting at Old City

ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు."నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

English summary
Next schedule of Ram Charan and Sreenu Vaitla’s film kickstarted this morning in the Old City and some crucial scenes involving the film’s principal cast will be canned in this schedule.
Please Wait while comments are loading...