twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    5 వేల కోసం చిరు పడ్డ ఇబ్బందులు, ఇల్లు గడవని పరిస్థితి.. ఆదుకున్నది ఆయనే.. రాంచరణ్!

    |

    Recommended Video

    Ram Charan Speech @Happy Wedding Pre Release Event

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధిగా మెగా డాటర్ నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. రాంచరణ్ తో పాటు ఈ వేడుకకు అల్లు అరవింద్, నాగబాబు అతిధులుగా హాజరయ్యారు. డెబ్యూ దర్శకుడు లక్ష్మణ్ కార్య రూపొందించిన హ్యాపీ వెడ్డింగ్ చిత్ర బృందానికి రాంచరణ్ శుభాకాంక్షల తెలియజేసారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న సుమంత్ అశ్విన్ తండ్రి ఎంఎస్ రాజు గురించి రాంచరణ్ అద్భుత విషయం వెల్లడించాడు.

    యూవీ క్రియేషన్స్

    యూవీ క్రియేషన్స్

    ఈ చిత్ర నిర్మాతలు యూవీ క్రియేషన్స్ వారు తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని రాంచరణ్ తెలిపాడు. యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన ప్రతి చిత్రం.. చిన్న చిత్రం, పెద్ద చిత్రం అని తేడా లేకుండా అన్నీ సూపర్ హిట్ అవుతున్నాయని రాంచరణ్ అభినందించారు.

    సాయిపల్లవి సాంగ్ కేక

    సాయిపల్లవి సాంగ్ కేక

    ట్రైలర్ చూసిన తరువాత ఈ చిత్రం తప్పనిసరిగా విజయవంతం అవుతుందని భావిస్తున్నట్లు రాంచరణ్ తెలిపాడు. చిత్ర సంగీత దర్శకుడు శక్తి కాంత్ ని కూడా చరణ్ ప్రశంసించాడు. ఫిదా చిత్రంలోని సాయిపల్లవి సాంగ్ 'వచ్చిండే' తనకు చాలా ఇష్టమని తెలిపాడు.

    5 వేలు అప్పు కోసం మెగాస్టార్

    5 వేలు అప్పు కోసం మెగాస్టార్

    ఈ ఆడియో వేడుక సందర్భంగా సుమంత్ అశ్విన్ తండ్రి ఎంఎస్ రాజు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నాన్న గారు కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ విషయాన్ని తనతో ఇటీవల ప్రస్తావించారని తెలిపాడు. ఓ నెలలో 5 వేలు అప్పు దొరకక ఇల్లు గడవని పరిస్థితిలో అమ్మా, నాన్న ఉన్నారని తెలిపాడు.

    అప్పు ఇచ్చింది ఆయనే

    అప్పు ఇచ్చింది ఆయనే

    ఆ సమయంలో సినిమాలు చేస్తున్న నిర్మాతలని అడిగితే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. చివరి ప్రయత్నంగా ఎంఎస్ రాజు తండ్రి అయ్యప్ప రాజుని అడిగారు. ఆయన వెంటనే నాన్నకు 5 వేలు ఇచ్చి ఆదుకున్నారని రాంచరణ్ తెలిపారు. తాను ఈవేడుకకు నిహారిక కోసం రాలేదని ఎంఎస్ రాజు కుటుంబం కోసమే వచ్చానని తెలిపాడు.

    సైరా గురించి అప్డేట్

    సైరా గురించి అప్డేట్

    సిరివెన్నెల సీతా రామశాస్త్రి గురించి మాట్లాడుతూ.. నా తొలి చిత్రానికి ఆయన సాంగ్ రాశారు. సైరా చిత్రంలో చాలా కీలకమైన పాట రాస్తున్నారని రాంచరణ్ వివరించారు. సైరా చిత్రం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది.

    మురళి శర్మతో

    ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన మురళి శర్మ గురించి చరణ్ ప్రస్తావించాడు. ఆయనతో తాను ఎవడు చిత్రంలో నటించాను. త్వరలో మళ్ళీ కలసి నటించాలని కోరుకుంటున్నా అని చరణ్ తెలిపాడు.

    English summary
    RAM CHARAN Superb Speech at Happy Wedding Pre Release Event. He reveals interesting fact about MS Raju family
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X