»   » దాసరిపై వ్యాఖ్యలకు నాలుక కరుచుకున్న రామ్ చరణ్ తేజ, వివరణ

దాసరిపై వ్యాఖ్యలకు నాలుక కరుచుకున్న రామ్ చరణ్ తేజ, వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్లపై దాసరి నారాయణ రావు వ్యాఖ్యలను తప్పు పట్టిన హీరో రామ్ చరణ్ తేజ వెనక్కి తగ్గారు. హీరోయిన్లు అవార్డుల కార్యక్రమాలకు హాజరు కావడం లేదని దాసరి నారాయణ రావు చేసిన ప్రకటనలో నిజం లేదని రామ్ చరణ్ తేజ చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది. దీంతో రామ్ చరణ్ తేజ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంత పెద్ద దర్సకుడని అనేంత స్థాయి తనకు లేదని రామ్ చరణ్ చెప్పాడు. ఆ వ్యాఖ్యలు తాను దాసరి నారాయణ రావును ఉద్దేశించి చేయలేదని ఆయన అన్నారు. అ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చానని, తాను ఏ విధమైన వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. చౌకబారు ప్రచారం కోసం దాన్ని వివాదం చేస్తున్నారని ఆయన అన్నారు.

చౌకబారు ప్రచారానికి పాల్పడాల్సిన అవసరం లేదని నిర్మాత నట్టికుమార్ అన్నారు. రామ్ చరణ్ తేజ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగానే ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా ముందుకు వచ్చి రామ్ చరణ్ తేజ వివరణ ఇచ్చారని, అందుకు సంతోషిస్తున్నామని ఆయన అన్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులపై నట్టి కుమార్ చాలా కాలంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
Tollywood hero Ram Charan Teja clarified on his comments on Dasari narayana Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu